Amit Shah: ఆ ఇద్దరికి అమిత్‌షా వార్నింగ్‌.. తప్పు చేశారో..

పార్లమెంట్‌ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌ లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా.. ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా.. ఎవరు తప్పు చేసినా.. ఒప్పుకునేది లేదు అని తెగేసి చెప్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 04:43 PM IST

Amit Shah: అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాకపోయినా.. బీజేపీ ఓటు బ్యాంక్ భారీగా పెరిగింది. దాదాపు 19 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన కమలం పార్టీ.. 40కి పైగా నియోజకవర్గాల్లో డిపాజిట్ దక్కించుకుంది. కీలక నేతలు అందరూ ఓడిపోగా.. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులకు.. లోక్‌సభ ఎన్నికల్లో బ్రేక్‌ చెప్పాలని ఫిక్స్ అయింది బీజేపీ. పార్లమెంట్‌ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌ లక్ష్యంగా పావులు కదుపుతోంది.

Priyanka Gandhi Vadra: ప్రియాంకా గాంధీకి ఈడీ షాక్.. మనీ లాండరింగ్ కేసు చార్జిషీటులో పేరు

తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా.. ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా.. ఎవరు తప్పు చేసినా.. ఒప్పుకునేది లేదు అని తెగేసి చెప్తున్నారు. గురువారం తెలంగాణలో పర్యటించిన అమిత్ షా.. బీజేపీ సీనియర్లకు క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరూ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని, అసలు లీకులు ఇవ్వొద్దని నేతలకు అమిత్ షా క్లియర్‌గా చెప్పినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వార్‌పై కూడా షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందరు నేతల ముందే సీనియర్లకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో బండి, ఈటల వర్గం వార్‌ సాగుతోంది. బండికి, ఈటలకు విబేధాలంటూ పార్టీతో పాటు రాజకీయవర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో పార్టీని ఈ విభేదాలే దెబ్బకొట్టాయన్న వాదన కూడా ఉంది.

ఈటల పార్టీ మారుతున్నారంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక అటు ఈటల రియాక్షన్ కూడా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని.. బీజేపీలో కొందరు కావాలని టార్గెట్‌ చేస్తున్నారని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లకు షా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇక అటు సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కూడా అమిత్‌ షా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 4 సిట్టింగ్ స్థానాలు మినహా.. మిగతా లోక్‌సభ స్థానాలపై కూడా షా ఆరా తీసినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయ్. సిట్టింగ్ ఎంపీలు వారి సీట్లలోనే పోటీ చేయాలని షా చెప్పడంతో.. బండి సంజయ్ మరోసారి కరీంనగర్ నుంచే పోటీ చేయనున్నట్లు క్లారిటీ వచ్చినట్లు అయింది.