బ్రేకింగ్: అన్నలకు అమిత్ షా రెండే ఆప్షన్లు, వేటాడతా…!

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డీజీపీ, మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని స్పష్టం చేసారు.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 01:00 PM IST

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, డీజీపీ, మంత్రులతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. వికసిత్ భారత్ సాధించాలంటే అందులో మన ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని స్పష్టం చేసారు. కానీ ప్రభుత్వ ఫలాలు వారికి చేరకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారు అని మండిపడ్డారు. రోడ్లు, టవర్లు, చివరకు విద్య, వైద్యం కూడా గిరిజన ఆదివాసీలకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆసహనం వ్యక్తం చేసారు. గత కొన్నేళ్లలో మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో గణనీయమైన పురోగతి సాధించాం అన్నారు.

2022లో తొలిసారి మావోయిస్టు హింస కారణంగా జరిగిన మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదైందని తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు, పథకాలు కూడా వేగంగా చేరుతున్నాయన్నారు అమిత్ షా. బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.

హెలికాప్టర్ సేవలను వారికి అదజేయడం వల్ల గాయపడ్డ భద్రతా బలగాలను సకాలంలో ఆస్పత్రికి చేర్చడం లేదా భూమార్గం ద్వారా చేరుకోలేని ప్రాంతాలకు బలగాలను చేర్చడం సాధ్యపడిందన్నారు. ఈ ఏడాది ఛత్తీస్‌ఘడ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై చాలా పైచేయి సాధించామన్నారు. మావోయిస్టులకు కూడా పిలుపునిస్తున్నా.. హింసతో ఏదీ సాధించలేం. జనజీవన స్రవంతిలో కలవండని కోరారు. ఇందుకోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి వచ్చేయండని విజ్ఞప్తి చేసారు. పోలీస్ సామర్ధ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా బాగా పనిచేశాయని కొనియాడారు.