salaar- review : బాక్సాఫీస్‌కు అమ్మ మొగుడులా సలార్

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ కావాల్సిందే.

 

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ కావాల్సిందే.

సలార్ స్టోరీ విషయానికి వస్తే.. కథ మొత్తం ఖాన్సార్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. రాజమన్నార్, దేవా అనే ఇద్దరు ఫ్రెండ్స్. తమ స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది మొదటి పార్ట్. కేజీఎఫ్ తరహా లోనే ఖాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలని అంతా ట్రై చేస్తూ ఉంటారు. రాజమన్నార్ కూడా ప్రయత్నం చేసి ఓడిపోతాడు. అయితే.. అందులో గెలవడం కోసం తన స్నేహితుడైన దేవా సాయం కోరతాడు. రాజమన్నార్ ఓడిపోవడంతో పాటు దేవా ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే మాస్ కటౌట్ తో దేవా ఎంట్రీ ఇస్తాడు. దేవా ఎంట్రీతో సినిమా స్పీడందుకుంటుంది. అంతేకాక తన ఫ్రెండ్ శత్రువులందరిని దేవా అడ్డుతొలగించి ఖాన్సార్ ను రాజమన్నార్ సొంతం చేస్తాడు. కట్ చేస్తే రాజ్యం కోసమే రాజమన్నార్ తనని వాడుకుని మోసం చేసాడని దేవా తెలుసుకుంటాడు. దీనితో కథ మలుపు తిరుగుతుంది. దేవా తన స్నేహితుడికి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే స్టోరీ. ఖాన్సార్ ను దేవా ఎలా సొంతం చేసుకుంటాడు.. మోసాన్ని తెలుసుకున్న తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన స్టోరీ. మొదటి పార్ట్ చూసిన తర్వాత రెండవ పార్ట్ లో ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంటుంది.

పర్ఫామెన్స్ విషయానికి వస్తే..
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ ని చూస్తే రెండు కళ్లు చాలలేదనే చెప్పాలి. కేజీఎఫ్ స్టైల్ లో ఉన్న మేకింగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ట్రైలర్స్ చూసింది ఒకెత్తు అయితే బిగ్ స్క్రీన్ మీద మాస్ జాతర కనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ విశ్వరూపం చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి. ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసి స్టన్ అయ్యిపోవడం ఖాయాం అంటున్నారు. ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్, ఒక మంచి స్నేహం అందరినీ కట్టిపడేస్తున్నాయి. ప్రాణ స్నేహితులు, శత్రువులు ఎలా అయ్యారు అనే పాయింట్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ లో ఉన్న కాస్టింగ్ మొత్తం తమ తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ ఐ ఫీస్ట్ లాఅనిపిస్తోంది.

సాంకేతికి విభాగం..
ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ ను చాటుకుంటున్నాడు. తన దైన స్టైల్ సలార్ ను నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. నీల్ చూపించిన కాన్సార్.. ఆడియన్స్ ని వేరే ప్రపంచానికి తీసుకెళ్ళింది. కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ.. ఒకసారి కథలోకి వెళ్ళాక, తన మార్క్ సీన్స్ తో అదరగొట్టాడని చెబుతున్నారు. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త తగ్గినట్లు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంది ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ముఖ్యంగా 20 నిమిషాల నిడివిగల ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉంది. ఫైట్స్, హీరో ఎలివేషన్ సీన్స్, ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కోసమైనా.. ఈ సినిమాను చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖంగా స్క్రీన్ మీద ప్రభాస్ కటౌట్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉందట. ఈ మూవీ కూడా కేజీఎఫ్ స్టైల్ లోనే మ్యూజిక్, టేకింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ విభాగాల్లో మెప్పిస్తోంది. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌ల మధ్య స్నేహం, శత్రుత్వానికి దారి తీసిన పరిస్థితులు మొదటి భాగంలో ప్రధానంగా హైలైట్‌గా నిలిచాయి. ఊహించని ట్విస్ట్‌తో సలార్ మొదటి పార్ట్‌ ముగుస్తుంది. రెండో భాగంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను మెయిన్‌టైన్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ విజయవంతం అయ్యాడనే చెప్పాలి. ఓవరాల్ గా ఎన్నో ఏళ్లుగా ఆకలిమీదున్న అభిమానుల ఫుల్ మిల్స్ పెట్టినట్లు ఉంది.

బహుబలి తరువాత డార్లింగ్ అభిమానులు ఏమైతే ప్రభాస్ నుంచి కోరుకుంటున్నారో వాటిని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. ప్రభాస్ ఎంట్రీ సీన్‌తో పాటు, ఖాన్సార్‌లో ప్రభాస్ అడుగు పెట్టే సీన్లకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్‌లో ప్రభాస్ తన విశ్వరూపమే చూపించాడు. ఓవరాల్ గా బహుబలి తరువాత డార్లింగ్ ప్రభాస్‌కు ఆ రేంజ్ హిట్ దొరికినట్టే కనిపిస్తుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే 2000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సలార్‌తో బాక్సాఫీస్‌కు అమ్మ మొగుడులా ప్రభాస్ మరోసారి నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.