Balakrishna: 3 ఫ్లాపులతో ఏం తేలింది..?

దసరా దరువు ఈసారి బాక్సాఫీస్ బరువు పెంచుతుందన్నారు. కాని కొండంత రాగం తీసి ఖూనీ రాగంగా మార్చినట్టు ఈ వారం బాక్సాఫీస్ లో భూకంపాలు రానున్నయనేంతగా 4 సినిమాల మీద హైప్ పెంచారు. తీరా చూస్తే మూడు డిజాస్టర్లు.. అలాంటి ఇలాంటి ప్లాపులు కాదు, వన్ డేలోనే బిచానా ఎత్తేసే రేంజ్ డిజాస్టర్లు.

  • Written By:
  • Publish Date - October 21, 2023 / 06:26 PM IST

దసరా దరువు ఈసారి బాక్సాఫీస్ బరువు పెంచుతుందన్నారు. కాని కొండంత రాగం తీసి ఖూనీ రాగంగా మార్చినట్టు ఈ వారం బాక్సాఫీస్ లో భూకంపాలు రానున్నయనేంతగా 4 సినిమాల మీద హైప్ పెంచారు. తీరా చూస్తే మూడు డిజాస్టర్లు.. అలాంటి ఇలాంటి ప్లాపులు కాదు, వన్ డేలోనే బిచానా ఎత్తేసే రేంజ్ డిజాస్టర్లు.

లియో ప్రివ్యూకే యూఎస్ లో 8కోట్లొచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ 140 కోట్లు వచ్చాయి. కట్ చేస్తే సెకండ్ డే 45 శాతం టిక్కెట్లు డ్రాప్.. అంటే హార్ట్ కోర్ ఫ్యాన్స్ ని వదిలేస్తే, మిగతా సగం బ్యాచ్ సినిమాను రిజెక్ట్ చేసినట్టేగా.. సెకండ్ డేకే వసూళ్లు పడిపోవటంతో, పాన్ ఇండియా లెవల్లో ఇది మరో కేజీయఫ్, మరో బాహుబలి అన్న వాళ్లే ఇప్పుడేం అనాలో తెలియక కనీసం పెట్టుబడి వస్తే చాలనుకునే పరిస్తితి వచ్చింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్రెడీ అమ్మారు కాబట్టి ఆల్రెడీ 400 కోట్లపైనే వచ్చాయి. సో నిర్మాత సేఫ్, సినిమా కొన్నవాళ్ల ఖేల్ ఖతం.

ఈనెల ఫస్ట్ వీక్ లోకూడా మంథ్ ఆఫ్ మధు, మామామశ్చింద్ర, రూల్స్ రంజన్, మ్యాడ్ ఇలా కనీసం ఆరుమూవీలు ఒకేసారి దాడి చేశాయి. కాని ఏమైంది ఒక్కటే సినిమా హిట్టైంది. మ్యాడ్ లానే ఈ వారం భగవంత్ కేసరి గట్టెక్కింది. ఇందులో కూడా లోపాలున్నాయి. ఓవర్ ద టాప్ సీన్లు, సింక్ అవని కాజల్ రోల్, కనెక్ట్ కాని కామెడీ తోపాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ కాలేదు. కాని సెకండ్ హాఫ్, క్లైమాక్స్ దెబ్బతో భగవంత్ కేసరిని హిట్ అని కన్పామ్ చేస్తున్నారు.

ఎటొచ్చి పాన్ ఇండియా లెవల్లో జెండా ఎగరేద్దామనుకున్న మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు, హిందీలో కల్కీకంటేముందే భవిష్యవాణిని చూపించాలనుకున్న గణపథ్ మూవీటీంలకే చుక్కెదురైంది. రెండూ కూడా సింగిల్ షోకే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. విషయం తక్కువ ప్రమోషన్ ఎక్కువైతే ఇలానే ఉంటుంది.. అదే భగవంత్ కేసరిని చూస్తే ప్రమోషన్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ.. మొత్తానికి అనిల్ రావిపుడి స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది.