సీఎం రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తూ… మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తో… ఆమ్రపాలికి ఊహించని విధంగా షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుధ్యం అదుపు తప్పిందంటూ … ఫోటోలతో సహా ట్వీట్ చేశారు కేటీఆర్. సిటీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. సిటీలో దాదాపు వెయ్యి స్వచ్ఛ ఆటోలు ఉన్నా పనిచేయట్లదేన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయనీ… డెంగీ, మలేరియా, అతిసారం లాంటి సీజన్ వ్యాధులతో జనం ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ ట్వీట్ లో తెలిపారు.
మేయర్, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో వ్యవస్థ పనిచేయట్లేదన్నారు కేటీఆర్. ఈ శాఖను పర్యవేక్షించే మున్సిపల్ మంత్రి… ఎమ్మెల్యేలను కొంటానికి ఢిల్లీలో బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి… పౌరుల ఆరోగ్యాన్ని కాపాడాలి అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కేటీఆర్ తన ట్వీట్ తో ప్రభుత్వ తీరును ఎండగడుతూ… సీఎం రేవంత్ రెడ్డితో పాటు… ఈమధ్యే పార్టీ మారిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఏసుకున్నారు. వాళ్ళిద్దర్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ పెట్టిన పోస్ట్… GHMC కమిషనర్ ఆమ్రపాలికి తగిలింది. ఈమధ్యే ఆ పదవిలోకి వచ్చిన ఆమ్రపాలి… నగరం మొత్తం తిరుగుతున్నారు. పారిశుధ్యంపై దృష్టిపెడుతున్నారు. ఆమ్రపాలిపై ఎంతో నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి GHMC బాధ్యతలను అప్పగించారు. తీరా కేటీఆర్ సిటీ వరస్ట్ గా ఉందంటూ ట్వీట్ చేయడంతో… ఆమ్రపాలికి షాక్ తగిలింది. రేవంత్ స్పందించేలోపు… ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య విచిత్రంగా ఆమ్రపాలి ఇరుక్కుపోయింది.