Amrapali Kata: మేడం రేంజ్‌ మారిపోయింది.. సీఎంతో కలిసి లండన్‌లో అధికారులతో అమ్రాపాలి భేటి..

సీఎం రేవంత్‌ రెడ్డి అమ్రాపాలిని హెచ్‌ఎండీఏ డిప్యుటీ కమిషనర్‌గా నియమించారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ కమిషనర్‌గా కూడా బాధ్యతలు అప్పజెప్పారు. మూసీ నదిని డెవలప్‌ చేసేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అమ్రాపాలి.. తన మార్క్‌ చూపించడం మొదలు పెట్టారు.

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 05:51 PM IST

Amrapali Kata: అమ్రాపాలి. తెలంగాణలో ఈ ఐఏఎస్‌ ఆఫీసర్‌ గురించి తెలియని వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. వయసు తక్కువే అయినా.. తన డైనమిజంతో సీనియర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు అమ్రాపాలి. చాలా కాలం నుంచి కేంద్ర సర్వీస్‌లో ఉన్న అమ్రాపాలి.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్లీ తెలంగాణకు వచ్చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి అమ్రాపాలిని హెచ్‌ఎండీఏ డిప్యుటీ కమిషనర్‌గా నియమించారు. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ కమిషనర్‌గా కూడా బాధ్యతలు అప్పజెప్పారు.

BRS-KCR: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. బీఆర్ఎస్ నేతల్లో భయం..

మూసీ నదిని డెవలప్‌ చేసేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అమ్రాపాలి.. తన మార్క్‌ చూపించడం మొదలు పెట్టారు. ఇప్పటికే గుజరాత్‌ ఇరిగేషన్‌ అధికారులతో మూసీ డెవలప్‌మెంట్‌ గురించి భేటీ నిర్వహించారు. యమునా నదీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. అక్కడి అధికారులు అనుసరిస్తున్న పద్ధతులను క్షున్నంగా స్టడీ చేశారు. ఇప్పుడు అదే పనిమీద లండర్‌ వెళ్లారు అమ్రాపాలి. దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం మీటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి అటు నుంచి నేరుగా లండన్‌ వెళ్లిపోయారు. అమ్రాపాలి కూడా లండన్‌ వెళ్లి.. అక్కడి ఇరిగేషన్‌ అధికారులతో భేటీ నిర్వహించారు. మూసీ నదిని డెవలప్‌ చేయడం.. చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి విషయంలో లండన్‌ అధికారులతో మీటింగ్‌ నిర్వహించారు. లండన్‌లోని థేమ్‌ రివర్‌ మేనేజ్‌మెంట్‌ బాడీ అమ్రాపాలికి కీలక సూచనలు చేసినట్టు సమాచారం. మూసీ నదిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకునేందుకు అక్కడి అధికారులు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని సీఎం సమక్షంలో అమ్రాపాలి దగ్గరుండి మరీ చేయించారు.

త్వరలోనే వాళ్ల మోడల్‌లో మూసీ నది డెవలప్‌మెంట్‌ పనులు ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి తగ ప్రభుత్వం కూడా మూసీ నదిని డెవలప్‌ చేస్తామంటూ చెప్పింది. కానీ ఆ పని జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. అన్నింటి కంటే ముందు మూసీని అభివృద్ధి చేసే పని పెట్టుకున్నారు రేవంత్‌ రెడ్డి. అమ్రాపాలికి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి గ్రౌండ్‌ వర్క్‌ చేయిస్తున్నారు. కొన్ని విషయాల్లో తాను కూడా స్వయంగా ఇన్వాల్వ్‌ అవుతున్నారు. ఇందులో భాగంగానే అమ్రాపాలితో కలిసి లండన్‌లో అక్కడి ఇరిగేషన్‌ అధికారులతో భేటీ అయ్యారు. దేశవిదేశాల నుంచి తీసుకుంటున్న సలహాలతో మూసీని రేవంత్‌ సర్కార్‌ ఎలా తీర్చిదిద్దుతుందో చూడాలి మరి.