Turkey Earthquake : టర్కీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు..

టర్కీ దేశంలోని దేశ రాజధాని ఇస్తాంబుల్‌ వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైనట్లు తెలుస్తోంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది.

టర్కీ దేశంలోని దేశ రాజధాని ఇస్తాంబుల్‌ వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైనట్లు తెలుస్తోంది. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:39 గంటలకు భూకంపం సంభవించిందని ఈజీన్ జిల్లా కేంద్రంగా ఉందని AFAD సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తెలిపింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మేము ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌కి అందిన ప్రతి నివేదికను తెలియచేస్తామని ఇంటీరియర్ మినిస్టర్ అలీ యెర్లికాయ X లో చెప్పారు. ఆ దేశ వార్తా సంస్థ నివేదించిన విధంగా ఫీల్డ్ సర్వే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

గత సంవత్సరం 2023 ఫ్రిబ్రవరి 17 టర్కీ సిరియా దేశాల్లో సంబవించిన భూకంలో దాదాపు 4 వేల 500 మంది మృతి చెందగా 20వేల మందికిపైగా గాయాల పాలయ్యారు. ఆ ప్రకృతి విపత్తు యావత్ ప్రపంచాన్నే వణికించింది. తాజాగా మళ్లీ టర్కీలో భూకంపం సంభవించింది.

 

Suresh SSM