IRS OFFICER : చేతులు బొబ్బలు ఎక్కినా… కూలీ పనులు చేసిన IRS అధికారి

జీవితంలో కష్టపడి పైకొచ్చారు... మంచి ఉద్యోగం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు... తాను IRS అధికారి అయినా... తాను ఎక్కి వచ్చిన మెట్లను మాత్రం మర్చిపోలేదు సందీప్ అనే ఓ IRS అధికారి... సూర్యాపేట జిల్లా హుజూర్ నగరకు చెందిన ఆయన... కర్ణాటకలో రాష్ట్రంలోని IRS ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.

 

 

జీవితంలో కష్టపడి పైకొచ్చారు… మంచి ఉద్యోగం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు… తాను IRS అధికారి అయినా… తాను ఎక్కి వచ్చిన మెట్లను మాత్రం మర్చిపోలేదు సందీప్ అనే ఓ IRS అధికారి… సూర్యాపేట జిల్లా హుజూర్ నగరకు చెందిన ఆయన… కర్ణాటకలో రాష్ట్రంలోని IRS ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ గా… GST ఇన్వెస్టిగేషన్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ డ్యూటీ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చిల్చకుంట్లలో ఉపాధి హామీ కింద చెరువు పూడికతీత పనులు చేస్తున్నట్టు తెలుసుకున్నారు సందీప్. అధికారిగా తన హోదాలో ఎప్పుడూ ఏసీ గదుల్లో ఉండే ఆయన… చాన్నాళ్ళ తర్వాత మట్టి వాసన చూడాలనుకున్నారు.

కూలీల స్థితి గతులు తెలుసుకోడానికి ఉపాధి హామీ కూలీగా మారాడు.. పలుగు పట్టి మట్టి తవ్వాడా IRS అధికారి… పారతో ఎత్తి తట్టలో పోసి… ట్రాక్టర్ లో నింపాడు… అక్కడి నుంచి రైతు పొలానికి చేర్చే వరకూ అన్ని పనులూ కూలీలతో సమానంగా చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12న్నర దాకా కూలీలతో కలసి పనిచేశారు. కానీ ఇవన్నీ సందీప్ కి అలవాటు లేని పనులు. దాంతో ఆయన చేతికి బొబ్బలు ఎక్కాయి… అయినా లెక్క చేయలేదు. ఆ తర్వాత కూలీలతోనే కలసి అక్కడే భోజనం చేశాడు. వాళ్ళతో మాట్లాడి. కూలీల ఇబ్బందులు, వాళ్ళకి అందుతున్న వేతనం సంగతి తెలుసుకున్నాడు. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనీ… తనకు కష్టం విలువ తెలుసని చెప్పారు సందీప్. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్న్నారు. కూలీల కష్టాలు తెలుసుకోడానికే.. ఉపాధి పనికి వచ్చినట్టు IRS అధికారి సందీప్ తెలిపారు. వాళ్ళతో ఆడి పాడారు.

చివరల్లో తనతో పాటు పనిలో పాల్గొన్న 152 మంది కూలీలలకు తన జీతం నుంచి ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున అందించారు సందీస్… అంత పెద్ద ఆఫీసర్… తమతో కలసి పనిచేయడంతో కూలీలు ఆశ్చర్యపోయారు. IRS ఆఫీసర్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పారు.