విజయవాడ (Vijayawada) లోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (Pandit Nehru bus stand )లో ఓ ఆర్టీసీ బస్సు (RTC bus ) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి బస్టాండ్ లోని ప్రయాణుకుల వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కండక్టర్ తో సహా వెళ్తున్న ప్రయాణికులు, 10 నెలల చిన్నారి మృతి చెందింది. బస్సు కింద పడి మరి కొందరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన విజయవాడ బస్టాండ్ లోని 12వ ప్లాట్ ఫారమ్ లో చోటు చేసుకుంది.
Mahesh-Venky : పబ్లిక్ గా పేకాట ఆడిన మహేష్-వెంకీ మామ..
ఈ ప్రమాదం ఎలా జరిగింది..?
విజయవాడ లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ప్రాథమిక సమాచారం మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘటన జరిగిందని ఆర్టీసీ యాజమన్యం తెలిపింది. ఇక బస్సు ప్రయాణికుల పై వెళ్లడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా బస్సు ప్రయాణికుల పైకి దూసుకెళ్లడంతో బస్సు స్టాండ్ లో ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్థంకాక భయందోళనతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన కండక్టర్ గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు.