Tamili Sai : తమిళిసైకి ఊహించని షాక్.. వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా

ఏపీ కేబినెట్ (AP Cabinet) కొలువుదీరుతున్న వేళ... తెలంగాణ మాజీ గవర్నర్ (Former Governor), బీజేపీ (BJP) లీడర్ తమిళిసైకి ఊహించని షాక్ తగిలింది.

ఏపీ కేబినెట్ (AP Cabinet) కొలువుదీరుతున్న వేళ… తెలంగాణ మాజీ గవర్నర్ (Former Governor), బీజేపీ (BJP) లీడర్ తమిళిసైకి ఊహించని షాక్ తగిలింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమెకు కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్టేజ్ పైనే ఇద్దరూ సీరియస్ గా మాట్లాడుకోవడం కనిపించింది.

తెలంగాణ గవర్నర్ (Telangana Governor) గా పనిచేసిన తమిళిసై… ఆ పదవికి రిజైన్ చేసి… మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సౌత్ చెన్నైనుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏపీ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి తమిళి సై హాజరయ్యారు. వేదిక మీదకు రాగానే… అప్పటికే కూర్చొని ఉన్న అతిథులకు నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఆయన పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అభివాదం చేశారు. వాళ్ళిద్దరూ నవ్వుతూ పలకించారు. ప్రతి నమస్కారం చేశారు. వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళబోతున్న తమిళిసైని వెనక్కి పిలిచారు అమిత్ షా. ఆమెను సీరియస్ గా మందలించారు. వేళ్ళు పైకి చూపిస్తూ అమిత్ షా కోపంగా మాట్లాడారు. తమిళిసై ఏదో సంజాయిషీ చెప్పుకునే ప్రయత్నం చేసినా… అమిత్ షా వినిపించుకోలేదు. తనకు సంజాయిషీ ఇవ్వొద్దంటూ చేతులు అడ్డంగా ఊపడం కనిపించింది. వీళ్ళ సంభాషణను పక్కనే ఉన్న వెంకయ్యనాయుడుతో పాటు వెనక కూర్చుని ఉన్న కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా విన్నారు.

తమిళిసైని అమిత్ షా మందలించడానికి కారణం… ఈమధ్య తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలే అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైపై… తమిళిసై విమర్శలు చేశారు. పార్టీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయంటూ ఆమె కామెంట్ చేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అన్నామలై అధ్యక్షత ఉన్న కార్యవర్గంలో కొందరు క్రిమినల్స్ కి చోటు ఇచ్చారని తమిళిసై విమర్శించారు. అలాగే అన్నాడీఎంకేతో పొత్తు కుదరకపోవడం వల్ల బీజేపీ నష్టపోయిందన్నారు.

AIDMK పొత్తును అడ్డుకున్నారంటూ అన్నామలైపై పరోక్షంగా విమర్శలు చేశారు. తమిళిసై… పార్టీ అంతర్గ విషయాలను బహిరంగంగా మాట్లాడటంపై అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఈ సందర్భంలోనే తమిళిసైని అమిత్ షా హెచ్చరించినట్టు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ ఒక్క లోక్ సభ సీటు గెలవనప్పటికీ… ఆ పార్టీకి ఓట్ల శాతం బాగా పెరిగింది. దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైనే కారణమని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఈ పరిస్థితుల్లో అన్నామలైతో తమిళిసై గొడవ పెట్టుకోవడం, బహిరంగంగా కామెంట్స్ చేయడంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో తమిళిసైని ఢిల్లీకి పిలిపించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.