Anant Ambani : అనంత్ రెండో ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌.. ఎవరెవరికి ఎంత.. ఖర్చు ఎంతంటే..

అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంతే.. మాములుగా ఉంటుందా.. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. పెళ్లి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని అనే రేంజ్‌లో.. ఏర్పాట్లు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ.

అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంతే.. మాములుగా ఉంటుందా.. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. పెళ్లి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని అనే రేంజ్‌లో.. ఏర్పాట్లు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ. నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్‌ వేడుకలను.. అదుర్స్ అనే రేంజ్‌లో చేస్తున్నారు. ఇప్పటికే ఓసారి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు జరగగా.. రెండో సెలబ్రేషన్స్‌ కూడా స్టార్ట్ అయ్యాయ్. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా.. ఈవెంట్‌కు చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ముఖేష్‌ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జూలై 12న ముంబైలో జరగనుంది.

దీనికి ముందు.. సౌత్‌ ఫ్రాన్స్‌లోని విల్లాలో దేశ విదేశాలకు చెందిన 8వందల మంది గెస్ట్‌లతో.. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుక జరుగుతోంది. జూన్ 1న ఇటలీలోని పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది. అనంత్, రాధిక మూడు రోజుల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో పాపులర్‌ అమెరికన్ సింగర్‌ కేటీ పెర్రీ.. షో చేయబోతోంది. డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో గ్రాండ్‌ ఈవెంట్‌లో సందడి చేయనుంది. లా విటా ఇ అన్ వియాజియో థీమ్‌తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్‌కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్‌కు 7కోట్లు ఇచ్చారట. 424 కోట్ల విలువైన ఎస్టేట్‌లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7వేల 5వందల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తోంది.

క్రూయిజ్‌లోని ప్రతీ సూట్‌ స్పా, జిమ్‌, స్విమ్మింగ్ పూల్‌ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్‌ ఈవెంట్‌లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయ్.