మెడలో మీడియా ఐడీ కార్డు…చేతిలో మైక్ ఉంటే చాలు… వార్తల సేకరణ ఏమో గానీ… కొందరు వాటిని అడ్డం పెట్టుకొని దోచేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఇలాగే వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తూ… అందినంత దండుకుంటున్న ఫేమస్ యాంకర్ ఇప్పుడు పోలీసులకు దొరికిపోయింది. యాంకర్ దివ్య వసంత బెంగళూరు పోలీసులకు పట్టుబడింది. తన బండారం బయటపడటంతో భయంతో కేరళ వెళ్ళి దాక్కోవడంతో… అక్కడికి వెళ్ళి మరీ దివ్యను పట్టుకొచ్చారు.
కర్నాటకలో యాంకర్ దివ్య వసంత అంటే ఫేమస్. ప్రముఖ న్యూస్ ఛానల్ పేరు చెప్పి… టీమ్ తో కలసి బ్లాక్ మెయిల్ చేస్తూ పైసలు కమాయిస్తోంది దివ్య. ఇలాగే బెంగళూరులో ఓ స్పా ఓనర్ ని బెదిరించి… 15 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. అందులో కొంత అమౌంట్ ఇచ్చినా… ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో స్పా ఓనర్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. దాంతో యాంకర్ దివ్య బండారం బయటపడింది. పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో… కర్ణాటక నుంచి పరార్ అయింది దివ్య. కేరళలో తలదాచుకున్నట్టు పక్కాసమాచారంతో బెంగళూరు పోలీసులు అక్కడికెళ్ళి ఆమెను అరెస్ట్ చేశారు. వారం రోజులుగా దొరక్కుండా తప్పించుకొని తిరుగుతూ… పోలీసులకు చుక్కలు చూపించిన దివ్యను ఎట్టకేలకు బెంగళూరుకి తీసుకొచ్చారు.
యాంకర్ దివ్య అరెస్ట్ అవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు ట్విస్ట్ ను పోలీసులు బయటపెట్టారు. దివ్య ఈ బ్లాక్ మెయిల్ దందాల కోసం… ఓ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్న వెంకటేష్ కలసి… నైస్ రీసెర్చ్ టీమ్ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ గ్రూప్ లో సిటీలో ఎవరెవర్ని టార్గెట్ చేయాలో ఎజెండా పెట్టుకొని ప్రతీరోజూ చర్చిస్తూ ఉండేవారట. యాంకర్ దివ్య బాధితులు బెంగళూరు సిటీలో ఇంకా ఎంతమంది ఉన్నారో అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిగా పనిచేస్తూ… న్యూస్ ఛానెల్ CEO అని చెప్పుకుంటున్న వెంకటేష్ పైనా చర్యలు తీసుకుంది ఆ మీడియా సంస్థ.