Kavitha : కవితను చూసి అనిల్ కంటతడి.. ఢిల్లీకి అర్జెంట్ గా కేటీఆర్, హరీశ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత నాలుగు నెలలకు పైగా తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో కవితకు ఆరోగ్యం బాగుండటం లేదు.

 

 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షీణిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత నాలుగు నెలలకు పైగా తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో కవితకు ఆరోగ్యం బాగుండటం లేదు. దాంతో కోర్టు ఆదేశాలతో ఎయిమ్స్ కి తరలించి టెస్టులు చేయించారు తీహార్ జైలు అధికారులు. కవిత ఆరోగ్య పరిస్థితిని చూసి ఆమె భర్త అనిల్ కంటతడి పెట్టుకున్నారు.

తీహార్ జైల్లో ఉన్న కవితకు ఈమధ్య ఆరోగ్యం దెబ్బతింది. జ్వరం తగులుతుండటంతో బాగా నీరసంగా ఉంటోంది. నాలుగు నెలల్లో 10 కిలోల దాకా బరువు కూడా తగ్గిపోవడంతో భర్త అనిల్ ఆందోళనగా ఉన్నారు. ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు. కవితకు బెస్ట్ ట్రీట్మెంట్ అందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడానికి అనుమతి కోరుతూ ట్రయల్ కోర్టులో లాయర్ పిటిషన్ వేశారు. అందుకు తిరస్కరించిన కోర్టు… ఎయిమ్స్ లో మెడికల్ టెస్టులకు అనుమతి ఇచ్చింది. దాంతో కవితకు భర్త అనిల్ సమక్షంలో టెస్టులు చేశారు. డెంగీ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేశారు ఎయిమ్స్ డాక్టర్లు. తిహార్ జైల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. దాంతో చాలామంది ఖైదీలకు డెంగీ జ్వరాలు తగులుతున్నట్టు కవిత లాయర్ చెబుతున్నారు. కవిత ఆరోగ్యం క్షీణించడంపై ఫ్యామిలీ మెంబర్స్ ఆవేదనగా ఉన్నారు. అటు BRS పార్టీ లీడర్లు, కార్యకర్తలు కూడా ఆందోళనగా ఉన్నారు. కవితను ములాఖత్ లో కలుసుకునేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కవితకు ఎయిమ్స్ లో జరిగిన వైద్య పరీక్షలపై కోర్టుకు నివేదిక అందించనున్నారు తిహార్ జైలు అధికారులు. మెడికల్ గ్రౌండ్స్ మీద ఆమె బెయిల్ కోసం లాయర్లు ప్రయత్నిస్తున్నారు. సోమవారం లాయర్లు కవిత బెయిల్ పిటిషన్ వేసే అవకాశముంది.