2023 ఏడాదికి గుడ్ బై చెప్పేందుకు మూడునెలల టైం ఉంటే, గ్రాండ్ గా ఈ ఏడాదికి సెండాఫ్ ఇచ్చేందుకు మూడు భాషల్లో 8 సినిమాలు రెడీ అయ్యాయి. అక్టోబర్ లో బాలయ్య మూవీ భగవంత్ కేసరి, రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు, అలానే తమిల్ సినిమా లియో దసరాకు రాబోతున్నాయి.
అక్టోబర్ లోపోటీ విచిత్రంగా ఉండబోతోంది. హిట్లు తప్ప ఫెల్యూర్ తెలియని అనిల్ రావిపుడి తన భగవంత్ కేసరితోదాడి చేయబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో భగవంత్ కేసరి ఎఫెక్ట్ పీక్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఆరకంగా తెలుగు మార్కెట్ లో మాత్రం తమిళ్ మూవీ లియోకి ఈ దసరాకు చుక్కలే అనాల్సిందే.
లోకేస్ కనకరాజ్ కి కూడా విక్రమ్న, ఖైదీ, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కాబట్టి, తన కొత్త మూవీ లియో మీద కూడా భారీ అంచనాలున్నాయి. సో తనని తక్కువ అంచనా వేయలేం.. అలా అక్టోబర్, టైగర్ 3 మూవీతో నవంబర్ లో బాక్సాఫీస్ షేక్ కానుంది. సల్మాన్ ఖాన్ కి అచ్చొచ్చిన స్పై యాక్షన్ సీరీస్ లో వస్తోంది కాబట్టి, ఇది కూడా ఈ ఏడాది ఎండింగ్ కి బాక్సాఫీస్ లో రీసౌండింగ్ ఇచ్చే ఛాన్సే ఎక్కువ అయితే అసలు పోటి మాత్రం డిసెంబర్ లోనే ఉండబోతోంది. ఇయర్ ఎండ్ కి వసూళ్ల సౌండ్ కూడా మామూలుగా ఉండేలా లేదు. ఒకటి యానిమల్, రెండు డంకీ, మూడు ఆక్వామ్యాన్, నాలుగు సలార్.. అన్నీ మాస్ మతిపోగొట్టే సినిమాలే. అయితే యానిమల్, సలార్ లే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలుగా మారొచ్చే అంచనాలున్నాయి. ఎక్కువ శాతం సలార్ పది సెంచరీలను కొట్టే స్టామినా ఉందన్న మాటే వినిపిస్తోంది. అదే నిజమైతే, ఈ మూడు నెలల్లో విడుదలయ్యే అష్టదిగ్గజాల్లో అసలు దిగ్గజం సలారే అనుకోవాల్సిందే.