Music Director, Anirudh : అనిరుధ్ రేంజ్ మారిపోయింది.. ఇప్పుడు మూవీ కి 15 కోట్లు..!

టాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల మధ్య ఛార్జ్ చేస్తున్నాడు.. అనిరుధ్. మీడియం రేంజ్ సినిమాల బడ్జెట్ 20 నుంచి 30 కోట్ల మధ్యనే ఉంటుంది.

ఓ సినిమా హిట్ అవ్వాలి అంటే కథ కత్తిలా ఉండాలి. మ్యూజిక్ మ్యాజిక్ చేయాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ము దులపాలి.. అప్పుడే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇదే ఫార్ములా సత్తా చాటుతున్న ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. మిడ్ రేంజ్ సినిమాలో అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.

అనిరుధ్ చుట్టే కోలీవుడ్ మేకర్స్..

సౌత్ లో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. రీసెంట్ గా వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంలో మేజర్ క్రెడిట్ అనిరుధ్ కే దక్కింది. ఆర్డినరీ అనిపించే సన్నివేశాలు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎక్స్ ఆర్డినరీ మార్చాడు. దీంతో కోలీవుడ్ మేకర్స్ అంతా ఈ మ్యూజిక్ కంపోజర్ చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ప్రజెంట్ లియో మూవీ టూన్స్ అందిస్తున్న అనిరుద్ అజిత్, శింబు సినిమాలకు వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

టాలీవుడ్ లో 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్..!

టాలీవుడ్ లో కూడా అనిరుద్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అతని డేట్స్ కోసం తెలుగు మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్న అనిరుధ్ విజయ్ -గౌతమ్ తిన్ననూరి మూవీకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. మిడ్ రేంజ్ సినిమాలకి అనిరుధ్ ని పెట్టుకుంటే తమ సినిమాలకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు కొంత మంది మేకర్స్. అయితే అతను డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ చూసి షాక్ అవుతున్నారు. టాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల మధ్య ఛార్జ్ చేస్తున్నాడు.. అనిరుధ్. మీడియం రేంజ్ సినిమాల బడ్జెట్ 20 నుంచి 30 కోట్ల మధ్యనే ఉంటుంది. అందులో మెజారిటీ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇచ్చేస్తే ఇక సినిమా చేయడం కష్టం. ఒక వేళ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని పెట్టుకున్న దర్శకుడు డిమాండ్ చేసే పరిస్థితి లేదు. అతను ఎప్పుడు అవుట్ పుట్ ఇస్తా అంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. దీంతో అనిరుద్ తో మ్యూజిక్ చేయించుకోవాలని మీడియం రేంజ్ హీరోలు ఆశ పడుతున్న వారికి అందనంత పంతులు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉండటం విశేషం.