రాజకుటుంబ వారసునిగా జడేజా జామ్ సాహెబ్‌గా ప్రకటన

మాజీ భారత క్రికెట్ జట్టు స్టార్ అజయ్ జడేజాను జామ్ నగర్ తదుపరి జామ్ సాహెబ్‌గా ప్రకటించారు. గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీరం చారిత్రక హలార్ ప్రాంతానికి చెందిన నవనగర్ రాజ కుటుంబానికి తదుపరి వారసుడిగా ధృవీకరించారు.

  • Written By:
  • Updated On - October 15, 2024 / 01:08 PM IST

మాజీ భారత క్రికెట్ జట్టు స్టార్ అజయ్ జడేజాను జామ్ నగర్ తదుపరి జామ్ సాహెబ్‌గా ప్రకటించారు. గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీరం చారిత్రక హలార్ ప్రాంతానికి చెందిన నవనగర్ రాజ కుటుంబానికి తదుపరి వారసుడిగా ధృవీకరించారు. ఈ మేరకు ప్రస్తుత రాజు అయిన జాం సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సిన్హ్‌జీ జడేజా తన వారసుడిగా సింహాసాన్ని అధిష్టించనున్నాడని ప్రకటించారు. దీనికి జడేజా కూడా అంగీకరించినట్టు మహారాజు తెలిపారు. అజయ్ జడేజా 1992 నుంచి 2000 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు. తన క్రికెట్ కెరీర్‌తో పాటు, జడేజా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.