ఏపీకి మరో బ్యాడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని... అవి అతి భారీ వర్షాలు కూడా కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Written By:
  • Publish Date - September 4, 2024 / 01:46 PM IST

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని… అవి అతి భారీ వర్షాలు కూడా కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరతిల ఆవర్తనం ఏర్పడిందని దాని కారణంగా రానున్న 24 గంటల్లో పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం… అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వరద ప్రభావం దెబ్బకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు నానా అవస్థలు పడుతున్నాయి.