ఢిల్లీలో మరో సారి బాంబు కాల్స్ కలకలం.. ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు..

కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మెల్స్ కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు ఢిల్లీలో కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో సారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ సారి ఏకంగా దేశంలో పెద్ద నగరాలకే టార్గెట్ గా మెల్స్ వచ్చాయి.

తాజాగా ముంబైలోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 176 మంది ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే అప్రమత్తమైన విమాన సిబ్బంది, అధికారులు.. ప్రయాణికులను ఎమర్జెన్సీ మార్గం ద్వారా కిందకు దించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ తో విమానాని క్షుణ్ణంగా తనిఖిలు చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ యూపీ నుంచి వచ్చిందని, నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.