Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమల నడక దారిలో బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. లక్షిత పై దాడి చేసిన ప్రాంతంలోనే దీనిని బోనులో బంధించినట్లు అటవీ శాఖ అదికారులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 08:33 AM IST

తిరుమల అనగానే ఆధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది. ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకసారైనా స్వామి దర్శనానికి నోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 27 వరకూ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. ఇలాంటి సమయంలో తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గత వారం రోజుల నుంచి చిరుత సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గతంలో లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కినట్లు తెలిపారు. దీనిని తిరుపతి శ్రీ వెంకటేశ్వరా జూ పార్క్ కి తరలించేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే ఇటీవలె కాలంలో చిరుతల సంచారం ప్రతి ఒక్కరికీ భయాందోళన కలిగిస్తోంది. దీంతో నడక దారిలో వెళ్లేందుకు భక్తులు జంకుతున్నరు. టీటీడీ భక్తుల భద్రత దృష్ట్యా ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసింది. నడుచుకుంటూ వెళ్లే వారి చేతికి ఒక కర్రను కూడా అందిస్తోంది. అయితే మరిన్ని ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టే అంశం పై తిరుమల తిరుపతి దేవస్థానం కసరత్తు చేస్తోంది.