దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఆవిర్భవం కాబోతుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త (Election Strategist) ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నారు. ఆ పార్టీని తన సొంత రాష్ట్రం అయిన బిహార్ లో గాంధీ జయంతి రోజున జన్ సురాజ్ పేరుతో ఆయన ఓ క్యాంపెయిన్ నడుపుతున్నట్లు.. రాజకీయ వ్యూహకర్త, I-PAC ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.
కాగా ఈ క్యాంపెయిన్ దానినే పొలిటికల్ పార్టీగా మారుస్తున్నట్లు పీకే పేర్కొన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘జన్ సురాజ్’ (Jan Suraj) పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో JDU అధినేత, సీఎం నితీశ్ కుమార్‌ను ఢీకొడతామన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్ మనవరాలు జాగృతి ఠాకూర్ తో పాటు మరి కొంత మంది నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. బీహార్ (Bihar) బలమైన రాజకీయ పార్టీగా చెప్పుకునే ఆర్జేడీ జన సూరాజ్ రాజకీయ పార్టీగా అవతరించనుందని ప్రకటనతో గందరగోళాన్ని పెంచుతుంది. అని జన్ సూరాజ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా మెరుగైన విద్య, వైద్యం, బిహార్ భవిష్యత్తు కోసం శ్రమించాలని కార్యకర్తలకు ప్రశాంత్ కిశోర్ దిశానిర్దేశం చేశారు. రెండేళ్ల క్రితం బిహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రను ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. అయితే ప్రశాంత్ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ, జేడీ(యూ) కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొడతారా, లేక ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. బీహార్ ముఖచిత్రాన్ని మార్చడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు. అలాగే ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ రామ్‌బలి సింగ్ చంద్రవంశీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు పార్టీలో చేరారు. కాగా, కోటి మంది తన పార్టీలో చేరుతారని ప్రశాంత్ కిశోర్ ఇటీవల ప్రకటించారు.