ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi excise policy case)లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత (kavitha) జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టులో ఈడీ విజ్ఞప్తి మేరకు రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. కాగా ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను నిన్న కోర్టు కొట్టేసింది.
మార్చి 15న సాయంత్రం కవితను ఈడీ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ తర్వాత మరో మూడు రోజులు కవితకు ఈడీ(ED) కస్టడీని కోర్టు పోడగించింది. ఆ తర్వాత మార్చి 26న కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేడు కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 23 వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండక తప్పదు.