18ఏళ్ల కెరీర్‌లో అనుష్క ఇప్పటి వరకు రెండు భాషల్లో మాత్రమే నటించింది. తెలుగు, తమిళంలో తప్ప మరో లాంగ్వేజ్‌లో నటించని బొమ్మాళీ.. మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫేడౌట్ అంటూ వస్తున్న కామెంట్స్‌కు కొత్త ఆఫర్‌తో సమాధానం ఇచ్చింది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటించే తెలుగు సినిమా ఏదీ లేకపోయినా.. మలయాళంలో కథనార్ అనే మలయాళ మూవీ చేస్తోంది. హీరో జయసూర్య బర్త్ డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో బొమ్మాళీ ఎక్కడా కనిపించకపోయినా.. అరుంధతి మాదిరి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుంది.
అనుష్క డెబ్యూ మలయాళ మూవీ కథనార్ మొదటి భాగం 2024లో రిలీజ్ అవుతోంది. రోజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. 14 భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం సైజ్ జీరో కోసం వెయిట్ పెరిగి ఆ తర్వాత తగ్గలేక ఆఫర్స్‌కు దూరమైంది. ఓవర్ వెయిట్‌తో వున్న బొమ్మాళీని హీరోలు పక్కన పెట్టేశారు. మూడేళ్లు ఖాళీగా వున్న అనుష్కకు అనుకోకుండా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాలో… యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో నటించే ఛాన్స్ వచ్చింది. సినిమా ఈనెల 7న థియేటర్స్‌లోకి వస్తోంది. ఎనిమిదేళ్లుగా వెయిట్ తగ్గాలని అనుష్క చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అనుష్క కెరీర్ పట్టాలెక్కడం కష్టమేనని ఫ్యాన్స్ అనుకుంటే… మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆదుకుంది. ఇంతకాలం తెలుగు, తమిళంలో మాత్రమే నటించిన అనుష్క.. ఫస్ట్ టైం మలయాళ మూవీతో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతోంది.