AP Assembly: నేడు తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ.. సభను బహిష్కరించిన టీడీపీ.. సభలో మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే 

ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు తారా స్థాయికి చేరాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ అసెంబ్లీ తిరిగి సోమవారం ప్రారంభంమైంది.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 09:55 AM IST

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. తాజాగా పార్లమెంట్ లో ఆమోదం పొందిన మహిళా బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మహిళా సాధికారత, మహిళల రిజర్వేషన్ల ప్రక్రియకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయనుంది. ఆతరువాత అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, భూ సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చ జరుగనున్నట్లు అసెంబ్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వీటితో పాటూ ఏపీలో దేవాలయాల అభివృద్దికి ఏవిధంగా తోర్పాటు అందించాలి అనే అంశంపై కూడా చర్చలు జరుగనున్నట్లు సమాచారం.

అసెంబ్లీకి సమానంగా భవిష్యత్ కార్యాచరణ..

ఇదిలా ఉంటే టీడీపీ నేతలు ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీని బైకాట్ చేసిన సందర్భంగా దీనికి ధీటుగా ప్రజల్లో తమ గొంతును వినిపించేందు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సమానమైన కార్యాచరణను ఏర్పాటు చేయాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్టీఆర్ భవన్ లో నేడు జరగబోయే మీటింగ్లో భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది.

సభలో చంద్రబాబు పాలనపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

గత టీడీపీ పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. టీడీపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రం పై మరింత అప్పుల భారం పెంచారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన బకాయిలన్నీ వైఎస్ జగన్ చెల్లించారని పేర్కొన్నారు. గత నాలుగేళ్ల వైపీపీ పాలనలో రైతు భరోసా కింద రూ. 31 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని జగన్ మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు.