అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. అనపర్తి నియోజకవర్గ పర్యటనలో కానీ, నియోజకవర్గ బయట పర్యటనలలో కానీ ప్రత్యర్థులు దాడులు చేస్తారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి.
వెంటనే అలెర్ట్ అయిన సర్కార్… అనపర్తి రామకృష్ణారెడ్డి కి ఉన్న వ్యక్తిగత భద్రత సిబ్బంది 1+1 ను 2+2 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండు షిఫ్ట్ లలో మొత్తం నలుగురు ఆయనకు భద్రత కల్పిస్తారు. కాగా ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో జాయిన్ అయి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబుకి అత్యంత నమ్మకమైన నేతగా ఆయనకు పేరు ఉండేది. రాజకీయ సమీకరణాలతో ఆయనకు బిజెపిలో సీటు ఖరారు చేసారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనపర్తి చంద్రబాబు పర్యటనలో అల్లర్లు రేగిన సంగతి తెలిసిందే.