Chandrababu Naidu: ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. ఆయనను ఈ కేసులో ఏ1గా చేరుస్తూ.. ఏపీ సీఐడీ.. ఏసీబీ కోర్టులో శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రబాబుతోపాటు ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ స్కాం జరిగినట్లు ఏపీ సీఐడీ ఆరోపించింది.
TDP IN TO NDA: పొత్తుల టైమ్.. ఎన్డీఏలోకి టీడీపీ ! ముహూర్తం ఎప్పుడంటే ?
రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు సంబంధించిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని చార్జిషీటులో సీఐడీ పేర్కొంది. టెండర్ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఖజానాకు రూ.114 కోట్ నష్టం వాటిల్లిందని సీఐడీ తెలిపింది. చంద్రబాబు కారణంగానే నష్టం వాటిల్లిందని, మిగతా కంపెనీలు టెండర్లు దాఖలు చేసినా.. వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని తెలిపింది. ఇలా అక్రంగా సంపాదించిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని పేర్కొంది.
రూ.కోట్లతో నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలకంగా వ్యవహరించారని, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఇదంతా చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిందని.. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారని సీఐడీ వివరించింది.