AP CID: హెరిటేజ్ పేపర్లు నిజంగానే దగ్ధం చేశారా.. సీఐడీ ఏమంటోంది..

సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్దం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 08:30 PM IST

AP CID: ఏపీలోని తాడేపల్లి సిట్ కార్యాలయంలో కొన్ని పేపర్లను సిబ్బంది దగ్ధం చేయడం సంచలనంగా మారింది. ఈ పేపర్లు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిట్ స్వాధీనం చేసుకున్న హెరిటేజ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లే అనే ప్రచారం మొదలైంది. సిట్ కాంపౌండ్‌లో ఇలా తమ కేసుకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేయడంపై సీఐడీ మండిపడింది. వైసిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని తేలిసి, కీలక ఫైళ్లను దగ్ధం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది.

Gautam Gambhir: కెప్టెన్లలో అతనే తోపు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు

సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్దం అయినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై మండిపడ్డారు. నేరపరిశోధనపై దృష్టి పెట్టాల్సిన ఏపీ సీఐడీ.. సీఎం జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కీలక డాక్యుమెంట్లను తగులబెడుతున్నారని విమర్శించారు. తాము ఎప్పటినుంచో చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ఘటనతో నిజమయ్యాయన్నారు. లోకేష్ వ్యాఖ్యలతో పత్రాల దహనం అంశం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ ప్రభుత్వం, సీఐడీపై టీడీపీ విరుచుకుపడుతోంది. దీంతో ఈ అంశంపై ఏపీ సీఐడీ స్పందించింది. హెరిటేజ్ డాక్యుమెంట్లు దగ్ధం చేశారని జరుగుతున్న ప్రచారాన్ని సీఐడీ ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని సీఐడీ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఇప్పటికే ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామని, వాటికి సంబంధించి ప్రతి ఛార్జ్ షీట్‌ను 8 వేల నుంచి 10 వేల కాపీలతో రూపొందించామన్నారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు, నిందితులకు కూడా అందించినట్లు తెలిపారు. అయితే, ఈ కేసుల్లో ఫొటో కాపీలు తీస్తున్నప్పుడు ప్రింటర్లలో కొన్ని పేపర్లు చిక్కుకుపోయి, ప్రింట్ సరిగ్గా రాలేదన్నారు. అలాంటి పేపర్లనే ఇప్పుడు తగలబెట్టామని వివరణ ఇచ్చారు. కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దర్యాప్తును తప్పుదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.