మీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి (AP CM JAGAN) వ్యతిరేకంగా అసభ్య పోస్టులు పెడుతున్నారా ? అయితే మీ ఆస్తులన్నీ ఏపీ సర్కార్ లాగేసుకుంటుంది. మీ అసెట్స్ ఎటాచ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్. అదేంటి… సోషల్ మీడియాలో (SOCIAL MEDIA) పోస్టులు పెడితేనే ఆస్తులు జప్తు చేస్తారా ? అంటే అవును మీరు విన్నది నిజమే. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చారు ఏపీ CID చీఫ్ సంజయ్. ఆ పోస్టులు షేర్ చేసినా, లైక్ చేసినా కూడా మీపై కేసులు పెడతామంటోంది ఏపీ సీఐడీ. (AP CID)
ఏపీ సీఎం జగన్ (CM Jagan), కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్ (AP CID Chief Sanjay) వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై CID నిఘా పెట్టింది. జగన్ కు వ్యతిరేక పోస్టులు చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్ ని గుర్తించింది. వాటిల్లో కొన్ని గుర్తించి తొలగించారట. అలాగే నిందితుల ఆస్తులు అటాచ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు CID చీఫ్. న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే గతంలో జడ్జిలపై పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్ కి చెప్పినా పట్టించుకోలేదు. దాంతో సీబీఐకి కేసును అప్పగించింది హైకోర్టు..
విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామంటోంది AP CID. యూకే, అమెరికా దేశాలకు CID బృందాలను కూడా పంపినట్టు CID చీఫ్ సంజయ్ చెప్పారు. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై LOC ప్రోసీడింగ్స్ చేపట్టారు. అసభ్యకర పోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దంటున్నారు సీఐడీ చీఫ్.
YSRCP నేతలే కాదు… ప్రతిపక్ష నేతలపై వచ్చిన సోషల్ మీడియా పోస్టులను కూడా CID తొలగించింది. మొత్తం 202 సోషల్ మీడియా అకౌంట్స్ మానిటరింగ్ చేస్తోంది CID డిపార్ట్ మెంట్. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ పుట్టుకొచ్చాయన్నారు AP సీఐడీ చీఫ్ సంజయ్.
అసభ్యకర పోస్టులను షేర్ చేసిన… లైక్ చేస్తున్న వాళ్ళపై 2 వేల 972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేసింది సీఐడీ. ఈ మధ్య AP మంత్రులు, మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళపైనా చర్యలుంటాయని CID చీఫ్ సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మరి YCP సోషల్ మీడియా కార్యకర్తలు కూడా పోస్టులు పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని TDP, జనసేన పార్టీలు ప్రశ్నిస్తున్నాయి