ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్.. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లి సీఎం జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నందినగర్ లోని కేసీఆర్ నివాసం కు వెళ్లారు.
సీఎం జగన్ ను కేసీఆర్ కుమరుడు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర నేతలు రిసీవ్ చేసుకున్నారు. సీఎం జగన్ ను కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ వద్దకు వెళ్లి సీఎం జగన్ కాసేపు మాట్లాడారు. కేసీఆర్ ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ను ఆయన బెడ్ మీద నుంచే పలకరించారు. కేసీఆర్ పక్కనే కుర్చీలో కూర్చునే జగన్ ఆయనతో మాట్లాడారు. శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్య పరిస్ధితితో పాటు నడక, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుంటి శస్త్ర చికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు.