AP ELECTIONS: ఏపీలో ఎన్నికల మూడ్ పీక్స్‌కు చేరింది. మార్పులను ఓ పార్టీ నమ్ముకుంటే.. పొత్తుల ఎత్తులను సంధిస్తున్నాయ్ మరికొన్ని పార్టీలు. అదేదో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిందనే రేంజ్‌లో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు కన్ఫార్మ్ అయింది. బీజేపీ చేరుతుందా లేదా అన్న టెన్షన్ కనిపిస్తోంది. ఐతే వైసీపీ మాత్రం ఒంటరిగానే బరిలో దిగేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ఎవరిది అధికారం..? అన్ని పార్టీలను ఎదురొడ్డి జగన్ నిలబడగలరా..? అధికారం నిలబెట్టుకోగలరా..? అనే డిస్కషన్ వినిపిస్తోంది.
YS SHARMILA: షర్మిలకు భద్రత పెంపు.. ఇప్పటికైనా పిచ్చి లాజిక్‌లు ఆపేస్తారా ?
ఐతే లేటెస్ట్ సర్వే ఒకటి సంచలన ఫలితాలు బయటపెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయం అని నివేదిక బయటపెట్టింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 17లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోందని.. వైసీపీ 8స్థానాలకు పరిమితం కానుందని.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియాటుడే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియాటుడే సంస్థ అనౌన్స్ చేసింది. 2023 డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. 22 లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంది. టీడీపీ 3 స్థానాలకే పరిమితం అయింది. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది.
45శాతం ఓటింగ్‌తో టీడీపీ 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందని తెలిపింది. వైసీపీ 41 శాతం ఓటింగ్‌తో 8 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈసారి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో తేల్చింది. 17 లోక్‌సభ స్థానాలకుగానూ బీజేపీకి 3, బీఆర్ఎస్‌కు 3, మజ్లిస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 9, బీజేపీకి 4, కాంగ్రెస్‌కు 3, మజ్లిస్ ఒక సీటు గెలుచుకున్నాయ్.