ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎంతమంది మరణించారు, నష్టం ఎంత వాటిల్లింది అనే దానిపై ప్రభుత్వం లెక్కలు విడుదల చేసింది. భారీ వర్షాలు వరదల వలన రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 1,69,370 ఎకరాల్లో పంట , 18424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగింది. 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయారు.
60 వేల కోళ్లు మృతి చెందగా 222 పశువులు ప్రాణాలు విదిచాయి. వరదల వలన 22 సబ్ స్టేషన్ లు దెబ్బతిన్నాయి. 3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం వరదల వలన నష్టపోయిన వాళ్ళు 6,44, 536 మంది ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 193 రిలీప్ క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న వాళ్ళు 42,707 మంది అని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలో 50 ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. అందుబాటులో ఆరు హెలికాఫ్టర్లు ఉండగా వివిధ ప్రాంతాల నుంచి 228 బోట్లు తీసుకొచ్చారు.