APPSC Group -1 Mains: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..

టీడీపీ హయాంలో 2018లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తర్వాత ఫలితాలు వెల్లడించారు. ఇలా ఎంపికైన వాళ్లు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అయితే, ఈ ఫలితాల్లో పొరపాట్లు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 01:58 PM IST

APPSC Group -1 Mains: 2018లో ఏపీపీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో 2018లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తర్వాత ఫలితాలు వెల్లడించారు.

KAVITHA CONTEST : ఇందూరులో పోటీకి.. కవిత భయపడుతున్నారా ?

ఇలా ఎంపికైన వాళ్లు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అయితే, ఈ ఫలితాల్లో పొరపాట్లు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. జవాబు పత్రాల్ని రెండుసార్లు, మూడుసార్లు దిద్దారని కొందరు అభ్యర్థులు కోర్టుకు తెలిపారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను పక్కనబెట్టి, రెండోసారి మళ్లీ జవాబు పత్రాల్ని దిద్దారని, ఇలా చేసి.. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఫలితాలు ప్రకటించారని అభ్యర్థులు కోర్టులో వివరించారు. అందువల్ల తమకు అన్యాయం జరిగిందని, పరీక్ష రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. అలాగే ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేసింది. తిరిగి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్‌సీకి హైకోర్టు సూచించింది.

ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంపై.. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం సూచించింది. ఆ నోటిఫికేషన్ కింద ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది. తాజా హైకోర్టు తీర్పుపై.. ఎంపికైన ఉద్యోగుల తరఫున న్యాయపోరాటం చేస్తామని, పైకోర్టులో అప్పీలుకు వెళ్తామని వెల్లడించింది.