నేటి నుంచే ఏపీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 1 2024 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ విధ్యాశాఖ షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకూ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి 1 2024 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ విధ్యాశాఖ షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకూ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది.

ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా.. వారిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,73,058 మంది.. సెకండ్ ఇయర్ 5,79,163 మంది ఉన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 38 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 38 మంది సూపరింటెండెంట్లను నియమించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేసింది ఏపీ విద్యాశాఖ. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ ను బోర్డు నియమించింది. ప్రతి పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, గ్రీవెన్స్ ల స్వీకరణకు 08645-277707, టోల్ ఫ్రీ నంబర్ 18004251531 కు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చు.

  • ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:

మార్చి 1- శుక్రవారం – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

మార్చి 4 – సోమవారం – ఇంగ్లిష్ పేపర్-1

మార్చి 6 – బుధవారం – మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

మార్చి 9 – శనివారం – మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

మార్చి 12 – మంగళవారం – ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

మార్చి 14 – గురువారం – కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

మార్చి 16 – శనివారం – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

మార్చి 19 – మంగళవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

  • ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:

మార్చి 2 – శనివారం – సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

మార్చి 5 – మంగళవారం – ఇంగ్లిష్‌ పేపర్-2

మార్చి 7 – గురువారం – మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2.

మార్చి 11 – సోమవారం – మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

మార్చి 13 – బుధవారం – ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

మార్చి 15 – శుక్రవారం – కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2

మార్చి 18 – సోమవారం – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

మార్చి 20 – బుధవారం – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2