YS SHARMILA: తన సోదరుడు జగన్ అంటే తనకు ద్వేషం లేదని, ఆయనది తన రక్తమే అని, అయితే, జగన్.. వైఎస్సార్ ఆశయాల్ని నిలబెట్టడం లేదన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. నర్సీపట్నం నియోజక వర్గం, ములగపుడి గ్రామ ప్రజలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ”జగన్ ఆన్న అంటే నాకు ద్వేషం లేదు. ఆయన నా రక్తమే. ఇది సిద్ధాంత పోరాటమే. వైఎస్సార్ ఆశయాలను జగన్ నిలబెట్టడం లేదు. జగన్ విధానాలు వైఎస్సార్ ఆశయాలు కాదు. వైఎస్సార్.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్సార్‌కు కాంగ్రెస్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.
KCR MEDIGADDA: అక్రమాల మేడిగడ్డ చూసొద్దాం.. కేసీఆర్‌కు రేవంత్ ఆహ్వానం
వైఎస్సార్ చనిపోయాక FIRలో పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదు. అది తెలియక చేసిన పొరపాటే కానీ తెలిసి చేసిన పొరపాటు కాదు. సోనియా గాంధీ ఈ విషయం నాతో స్వయంగా చెప్పారు. వైఎస్సార్ కుటుంబం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉంది. వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం. నా మనసు నమ్మింది కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరా. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ మోసం చేయలేదు. వైఎస్సార్ ఆశయాలు కాంగ్రెస్‌తోనే సాధ్యం అని నేను నమ్మాను. వైఎస్సార్ ఆశయాలను జగన్ ఒక్కటి కూడా పట్టించుకోలేదు. అనాడు వైఎస్సార్ జలయజ్ఞంతో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్ట్‌లు కట్టాడు. వైఎస్సార్ చనిపోయే నాటికి 42 పెండింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వైఎస్సార్ పెండింగ్ ప్రాజెక్ట్‌లను జగన్ మొత్తం పూర్తి చేస్తాం అన్నాడు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాడు. 5 ఏళ్లుగా ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. తట్టెడు మట్టి కూడా తీయలేదు. వైఎస్సార్ ఆశయాలు సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి కదా..? ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి కదా..? ఎందుకు జలయజ్ఞం ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారు.
Baby Movie: కొత్త సమస్య.. ‘బేబీ’ సినిమా కథ నాదే.. పోలీసులకు ఫిర్యాదు!
వైఎస్సార్ హయాంలో రైతు రారాజు. జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ. వైఎస్సార్ రైతు ఆశయాలను తుంగలోకి తొక్కాడు. గిట్టుబాటు ధర లేదు. పంట నష్ట పరిహారం లేదు. సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారు. రైతులకు ప్రయోజనం పక్కన పెట్టి వాళ్ళ భూములే కబ్జాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత కూలి పనులకు పోతున్నారు. రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు. గాడిదలు కాస్తున్నారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదు. ఎంపీలు రాజీనామా చేసి ఉంటే హోదా వచ్చి ఉండేది కదా. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి, వంగి వంగి దండాలు పెడుతున్నారు. యువత లేని రాష్ట్రంగా ఆంధ్ర తయారవుతుంది. జగన్ మోహన్ రెడ్డి ఒక కుంభ కర్ణుడు. ఎన్నికల ముందు ఉద్యోగాలు అని నిద్ర లేచాడు. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారు.
మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడు. మద్యపాన నిషేదం పక్కన పెడితే సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్ వాగ్దానాలు అన్ని మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయి. కల్తీ మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారు. దేశంలోనే 25 శాతం మరణాలు ఆంధ్రలో ఎక్కువ. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్ర విభజన హామీలు, రాజధాని నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్‌తోనే రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం. పరిశ్రమలు తెస్తాం. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తాం” అని షర్మిల వ్యాఖ్యానించారు.