AP Volunteers: ఏపీలో ఫించన్లు ఆపిందెవరు..? అసలేం జరిగింది..?

వాలంటీర్లకు పనులు ఇవ్వొద్దని టీడీపీ అభ్యంతరం పెట్టడం వల్లే లేట్ అయ్యాయని అధికార పార్టీ అంటోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాలంటీర్లతో ఎలాంటి పనులు చేయించవద్దని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది.

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 01:55 PM IST

AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా ఒకటిన ఠంఛన్ గా ఫించన్ తీసుకునే అవ్వా తాతలకు ఈసారి ఈనెల 3వరకూ అందట్టేదు. ఫించన్లు ఆగిపోడానికి టీడీపీయే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. అటు టీడీపీ నేతలు మాత్రం.. కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేసి ఆ నెపాన్ని మాపై నెడతారా అని ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లకు పనులు ఇవ్వొద్దని టీడీపీ అభ్యంతరం పెట్టడం వల్లే లేట్ అయ్యాయని అధికార పార్టీ అంటోంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో షాక్.. జుడీషియల్ కస్టడీ 15 రోజులు పొడిగింపు

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాలంటీర్లతో ఎలాంటి పనులు చేయించవద్దని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. టీడీపీ ఈసీకి ఫిర్యాదు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రులు, వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈనెల మూడున వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా ఒకటినే పింఛన్లు ఇస్తున్నారు. కానీ ఈసారి RBI సెలవులు, ఇతర కారణాలతో ఈ నెల పింఛన్ల పంపిణీ 3న చేపడతామని ఏపీ ప్రభుత్వం ముందే ప్రకటించింది. ఏపీలో ఫించన్ల పంపిణీ వ్యవహారం వాలంటీర్లతో ముడిపడి ఉంది. వాలంటీర్లు ఇళ్ళకు వెళ్ళి ఫించన్లు పంపిణీ చేస్తుంటారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా కొందరు వాలంటీర్లు వైసీపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. దాంతో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనిపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. స్పందించిన హైకోర్టు ఈసీకి ఆదేశాలు ఇవ్వడంతో.. ఈసీ వాలంటీర్లను ప్రభుత్వ పనులకు వాడుకోవద్దని చెప్పింది. దాంతో వాళ్ళంతా పింఛన్ల పంపిణీకి దూరమయ్యారు. ఇది పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది.

వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పించవద్దన్న ఈసీ ఆదేశాలని తనకు అనుగుణంగా మార్చుకుంటోంది వైసిపి. టీడీపీ ఫిర్యాదుతోనే పెన్షన్లు ఆగాయని ప్రచారం చేస్తోంది. కోర్టులో పిటిషన్ వేసింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ. దీన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నడిపిస్తున్నారు. ఈయన వెనుక చంద్రబాబు ఉన్నారని మంత్రులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల పంపిణీలో వాలంటీర్లను వాడొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ముందే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందంటున్నారు టీడీపీ లీడర్లు. కానీ ప్రభుత్వం కావాలనే వాలంటీర్లతో పనులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈసారి ప్రభుత్వమే ఆలస్యంగా పింఛన్లు ఇచ్చి.. ఆ ఇష్యూని టీడీపీ పైకి డైవర్ట్ చేస్తోందని మండిపడుతున్నారు. లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వడానికి వాలంటీర్లు కాకపోతే.. మిగతా సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ, టిడిపి మధ్య రచ్చ నడుస్తోంది.