YSRCP: ఏపీలో మరో సంచలన సర్వే.. అధికారం మళ్లీ వైసీపీదేనా..?

ఇప్పుడు మరో సర్వే సంచలనంగా మారింది. ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి రాబోతోందని.. ఈ సర్వే చెప్తోంది. నాగన్న సర్వే పేరుతో థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్.. సుమారు లక్షా 5వేల మంది అభిప్రాయాలను సేకరించారు.

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 07:07 PM IST

YSRCP: ఏపీలో ఎన్నికల హీట్‌ పీక్స్‌కు చేరింది. మాటలు తూటాల్లా పేలుతుంటే.. కూటమి వర్సెస్ వైసీపీ వ్యూహాలు.. సెగలు రేపుతున్నాయ్. రాజకీయం ఇలా ఉంటే.. మరోవైపు పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలను బయటపెడుతున్నాయ్. అభ్యర్థుల జాబితా, ప్రచారం, నేతలకు జనాల్లో ఉన్న జనాదరణలాంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వేను చేపడుతున్నాయి ఆ సంస్థలు. జన్‌మత్, లోక్‌పోల్, ఆత్మసాక్షిలాంటి పలు సంస్థలు సర్వే ఫలితాలను బయటపెట్టాయ్.

AP LIQUOR SHOCK: మందుబాబులకు షాక్.. మూతపడుతున్న మద్యం షాపులు.. కారణమిదే..

ఐతే ఇప్పుడు మరో సర్వే సంచలనంగా మారింది. ఏపీలో మరోసారి వైసీపీనే అధికారంలోకి రాబోతోందని.. ఈ సర్వే చెప్తోంది. నాగన్న సర్వే పేరుతో థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్.. సుమారు లక్షా 5వేల మంది అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 6 వందల మంది చొప్పున.. 157 స్థానాల్లో సర్వే చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయఢంకా మోగించనుందని ఈ సర్వే చెప్తోంది. వైసీపీ దాదాపు 103 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని నాగన్న సర్వే చెప్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 39స్థానాలు దక్కుతాయని సర్వేలో వెల్లడైంది. మిగిలిన 33సీట్లలో వైసీపీ, కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 49 నుంచి 51 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి 45 నుంచి 46 శాతం, కాంగ్రెస్ కు 0.8 నుంచి ఒక శాతం ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది.

లోక్‌సభ నియోజకవర్గాలవారీగా చూస్తే.. 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీనే విజయాన్ని కైవసం చేసుకోనుంది. కేవలం నాలుగు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుపొందే ఛాన్స్ ఉందని సర్వే అంచనా వేసింది. ఐతే దీన్ని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అది పెయిడ్ సర్వేనని.. కూటమిదే అధికారం ఖాయమని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధీమాగా చెప్తున్నారు. ఈసర్వే నిజం అవుతుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. సంచలనాలను మాత్రం క్రియేట్‌ చేస్తోంది.