IPHONE SPYWARE: ఐఫోన్ ఉన్నవాళ్ళు జాగ్రత్త.. మీ ఫోన్‌లో స్పైవేర్

ఇజ్రాయెల్ NSO గ్రూప్‌నకు చెందిన పెగాసెస్ నుంచి ఈ స్పైవేర్ రిలీజ్ అయింది. భారత్ సహా 92 దేశాల్లోని యూజర్ల యాపిల్ ఐడీలకు వార్నింగ్ మెస్సేజ్‌లు, మెయిల్స్ కూడా పంపింది యాపిల్ సంస్థ. గతంలో కూడా పెగాసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 03:19 PM IST

IPHONE SPYWARE: మీకు ఐఫోన్ ఉందా.. అయితే జాగ్రత్త. అందులోకి స్పైవేర్ చొరబడే అవకాశముందని యూజర్లకి యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ దాడులు జరిగే ఛాన్సుందని హెచ్చరించింది. భారత్ సహా 150 దేశాల యూజర్లకు ముప్పు ఉందని చెబుతోంది. ఇప్పటికే 92 దేశాల యూజర్లకు వార్నింగ్ మెస్సేజెస్ పంపింది యాపిల్ సంస్థ. యాపిల్ ఫోన్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్‌పై మెర్సెనరీ స్పైవేర్‌తో ఎటాక్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

Geethanjali Malli Vachindi Review: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ రివ్యూ.. భయపెట్టలేదు కానీ నవ్వించింది..!

ఇజ్రాయెల్ NSO గ్రూప్‌నకు చెందిన పెగాసెస్ నుంచి ఈ స్పైవేర్ రిలీజ్ అయింది. భారత్ సహా 92 దేశాల్లోని యూజర్ల యాపిల్ ఐడీలకు వార్నింగ్ మెస్సేజ్‌లు, మెయిల్స్ కూడా పంపింది యాపిల్ సంస్థ. గతంలో కూడా పెగాసిస్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. మెర్సెనరీ స్పైవేర్ ద్వారా ఐఫోన్‌లో ఉన్న మొత్తం డేటాను పెగాసిస్ కొట్టేసే అవకాశముంది. రెగ్యులర్ సైబర్ క్రిమినల్స్, మాల్ వేర్ నుంచి వచ్చే థ్రెట్ కన్నా ఇది డేంజర్ అని హెచ్చరించింది యాపిల్. అందుకే ఐఫోన్ యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐఫోన్లను ఇప్పటి నుంచే లాక్ డౌన్ మోడ్‌లో ఉంచాలన్నది. అలాగే లేటెస్ట్ IOS 17.4.1 వెర్షన్ అప్డేట్ చేసుకోవాలి.

ఒక్క ఐఫోన్లోనే కాదు.. మీ ఇంట్లో ఉన్న అన్ని యాపిల్ డివైజెస్‌లోనూ కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. కొత్తగా యూజర్స్‌కి వచ్చే మెస్సేజ్‌లు ఏవీ ఓపెన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది యాపిల్. అలా ఓపెన్ చేస్తే మెర్సెనరీ స్పైవేర్ ఎటాక్ అయి.. ఐఫోన్‌లో డేటా మొత్తం లాస్ అయ్యే ప్రమాదం ఉందని యాపిల్ సంస్థ వార్న్ చేస్తోంది.