మొన్నటి వరకు దొంగచాటుగా రెస్టారెంట్స్‌కు వెళ్లారు. కెమెరా ముందు దొరికిపోయామని.. పబ్లిక్‌లో తిరగడం స్టార్ట్ చేశారు. ఎంచక్కా మొగుడూపెళ్లాల్లా ఫంక్షన్స్‌కు కూడా వెళ్లారు. అక్కడితో ఆగకుండా ఓ అడుగు వేసి… డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసేసి..ఔను మేమిద్దరం సహజీవనం చేస్తున్నామంటూ… డైరెక్ట్‌గా చెప్పేశారు.
అదితి, సిద్దార్థ లవ్‌స్టోరీ ముదిరి పాకాన పడుతోంది. రెండేళ్ల క్రితం మహాసముద్రం సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సినిమాలో ఈ ఇద్దరి లవ్‌స్టోరీ ఫెయిల్ అయినా…బైట మాత్రం సక్సెస్ అయింది. రెండేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారు. మరి పెళ్లయితేగానీ.. ఈ లవ్‌స్టోరీకి శుభం కార్డు పడుతుందో లేదో తెలీదు.
అదితిరామ్ హైదరీ, సిద్దార్థ పెళ్లి చేసుకుంటే.. వీళ్లిదరికీ ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో వీరిద్దరూ పెళ్లయి విడాకులు తీసుకున్నారు. అయితే సిద్దార్థ మాత్రం చాలా ప్రేమకథలు నడిపాడు. శృతిహాసన్, సమంతతో ప్రేమలో విహరించి.. బ్రేకప్ చెప్పేశాడు. మరి అదితో ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా? అన్న డౌట్ లేకపోలేదు.
డేటింగ్ రూమర్స్‌పై ఈ ఇద్దరూ స్పందించకపోయినా.. ఎప్పుడూ వార్తల్లోనే వుంటున్నారు. శర్వానంద్ ఎంగేజ్మెంట్కు ఈ ఇద్దరూ కలిసి వెళ్లారు. రీసెంట్గా.. విశాల్ సినిమా ‘ఎనిమీ’లోని ‘టమ్ టమ్ ‘ సాంగ్‌కు స్టెప్పులేశారు. అక్కడితో ఆగకుండా… వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అదితి. ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశారు. చివర్లో అదితి చిలిపిగా నడుముతో ఓ తన్ను తంటే.. ప్రియుడు అవతల పడ్డాడు. ఈ రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకెళ్తే త్వరలోనే కొత్త కాపురం చూస్తామేమో.!