T Congress: కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌ నేతలే ముంచుతున్నారా!?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ బెటర్‌గా మారుతోంది. గతంలో పోలిస్తే పార్టీకి ప్రజల్లో ఆధరణ పెరిగింది.

  • Written By:
  • Publish Date - October 24, 2023 / 01:12 PM IST

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ బెటర్‌గా మారుతోంది. గతంలో పోలిస్తే పార్టీకి ప్రజల్లో ఆధరణ పెరిగింది. పార్టీలో జాయినింగ్స్‌ పెరిగాయి. కాస్త కస్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చే చాన్స్‌ కూడా ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్న వర్గపోరు ఆ పార్టీకి గొడ్డలిపెట్టుగా మారుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కేటీఆర్‌ కాంగ్రెస్‌ గురించి ఓ కామెంట్‌ చేశారు. కాగ్రెస్‌లో పది మంది సీఎం క్యాడెట్లు ఉంటారు. వాళ్లకు అధికారం ఇస్తే వాళ్లది వాళ్లకే వారానికో పంచాయితీ వస్తుందంటూ చెప్పారు. ఇప్పుడు వరుసగా జరుగుతున్న సీన్లు చూస్తుంటే కేటీఆర్‌ చెప్పిందే నిజం అనిపిస్తోంది.

రీసెంట్‌గా జరిగిన ఓ మీటింగ్‌ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం పదవి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో తానే ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటానంటూ చెప్పారు. కొన్ని రోజుల ముందు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తనతో పాటు నలుగురు సీఎం అభ్యర్థులు ఉన్నారంటూ చెప్పారు. అంతా కలిసి పనిచేస్తామని బయటికి చెప్పినా ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పరువు పోతోంది. ఆ పార్టీలో వర్గపోరు ఇంకా తగ్గలేదు అనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే సీఎం ఎవరు అనే విషయంలో పోటీ ఉంటుంది.

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌ భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంటక్‌ రెడ్డి, దామోదర రాజనరసింహ లాంటి సీనియర్లు సీఎం సీటు మీద ఆశతోనే ఉన్నారు. బయటకి చెప్పకపోయినా ఫైనల్‌గా వినిపించేది వీళ్ల పేర్లే. ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్‌లోకి జగ్గారెడ్డి కూడా చేరారు. ఇంకా ఎన్నికలే జరగలేదు. ప్రజల తీర్పు ఏంటో తెలియనేలేదు.. అప్పుడే సీఎం నేను అంటే నేను అని.. వచ్చిన కాస్త ఆదరణ కూడా పోగొట్టుకుంటన్నారు కాంగ్రెస్‌ వాళ్లు! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం పదవి ఎవరికి వస్తుంది అనేది పార్టీ హైకమాండ్‌ నిర్ణయం.. అప్పటి వరకూ అంతా కలిసి పని చేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే చాన్స్‌ ఉంది. అది వదిలేసి ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేస్తున్నారని అంటున్నారు. కేటీఆర్‌ చేసిన విమర్శలకు వీళ్ల కామెంట్లు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని.. ఎలక్షన్స్‌ అయ్యేవరకూ ఇలాంటి కామెంట్స్‌ చేయకుండా నేతలంతా కలిసి పనిచేస్తే బెటర్ అంటున్నారు.