పవన్ కల్యాణ్‌తో డైరెక్టర్స్,నిర్మాతలు విసిగిపోయారా? పైకి చెప్పలేకపోతున్నా.. లోలోన మధన పడిపోతున్నారా? మూడేళ్ల నుంచి పవన్ నే నమ్ముకుంటున్నా.. షూటింగ్ పూర్తి కావడం లేదు. పవన్ సినిమా అంటే.. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు కష్టాలు తప్పడం లేదు. పవన్‌తో సినిమా అంటే డైరెక్టర్‌కు క్రేజ్ వస్తుంది.. ప్రొడ్యూసర్‌కు ఈజీగా బిజినెస్ అయిపోతుంది. పవన్ డేట్స్ ఇవ్వడని తెలిసినా ఆయనే కావాలంటారు. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఆరు నెలల్లో పూర్తయ్యే సినిమా ఎంత ఆలస్యం అయినా.. 10 నెలలు పడుతుంది.. మహాఅయితే ఏడాదిలో పూర్తి చేసేయొచ్చని నిర్మాతలు బరిలోకి దిగితే.. యేళ్ళు గడిచిపోతున్నాయి. బడ్జెట్‌తో పోటీగా.. వడ్డీలు పెరిగిపోయి.. తడిసి మోపెడు అవుతోంది.
పవన్ సినిమా కెరీర్ సాఫీగా సాగడం లేదు. ఎప్పటికప్పడు పవన్‌లోని నటుడిని రాజకీయాలు డామినేట్ చేస్తున్నాయి. ఒక్క సినిమా షూటింగ్ కూడా సజావుగా సాగడం లేదు. అదిగో ఇదిగో అంటారేగానీ.. డేట్స్ ఇవ్వలేడు.. నిర్మాతలు ఏమీ అనలేరు. పవన్ చేతిలోవున్న మూడు సినిమాలు హరిహర వీరమల్లు.. ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజీ.. సెట్స్ పై ఉన్నాయి. పవన్ ఇప్పట్లో కెమెరా ముందుకొచ్చే అవకాశఆలు కనిపించడం లేదు. తెలంగాణా ఎన్నికల సందడి పూర్తికావడంతో.. ఏపీ ఎన్నికల హడావిడి మొదలైంది. మార్చిలో ఎలక్షన్స్ నోటిఫికేషన్.. ఏప్రిల్లో ఎన్నికలుంటాయి. పవన్ ఏ సినిమా చేసినా.. ఈ మూడు నెలల్లోనే. ఇన్నేళ్లుగా సెట్స్ పైకి రాని పవన్ వచ్చే మూడు నెలల్లో కూడా వచ్చే ఛాన్స్ లేదు. నిర్మాతలు ఏమీ చేయలేని హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో వున్నారు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌లో పవన్ పాల్గొని ఏడాది అవుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. వీరమల్లును పక్కన పెట్టి భీమ్లానాయక్.. బ్రో రిలీజ్ చేసిన పవన్.. ఈ సినిమాపై ఇంట్రస్ట్ చూపించడం లేదు. దర్శకుడు క్రిష్ మూడేళ్ల నుంచి వీరమల్లునే నమ్ముకోవడంతో కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. ఏమీ అనలేని పరిస్థితుల్లో నిర్మాత ఎ.ఎం రత్నం వున్నాడు.
ఓజీ షూటింగ్ ఆమధ్య నాన్‌స్టాప్‌గా జరిగి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే.. ఓజీ పూర్తవుతుంది. పవన్ డేట్స్ ఇచ్చి పూర్తి చేస్తే.. ఎన్నికల ముందు రిలీజయ్యే ఛాన్స్ ఈ ఒక్క సినిమాకే వుంది. కానీ.. డేట్స్ ఇవ్వడు. సినిమా పూర్తి చేయడు. పవన్‌కు పేరు.. క్రేజ్ తీసుకొచ్చిన సినిమాలను ఇంత చులకనగా చూడడం ఎందుకన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంట్రస్ట్ లేకపోతే.. ఇన్ని సినిమాలు ఒప్పుకుని.. అందరినీ బాధపెట్టడం ఎందుకన్న కామెంట్స్ ఫిలిం ఇండస్ట్రీలో జోరందుకున్నాయి. ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం పవన్ ఇంతవరకు 14 రోజుల షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంకో 40.. 50 రోజులు డేట్స్ ఇవ్వాలి. మూడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని దాదాపు రెండు నెలలు డేట్స్ ఇవ్వడు. 20 రోజుపాటు డేట్స్ ఇస్తే.. పూర్తయ్యే ఓజీకే డేట్స్ లేవు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఎన్నికలోపు ఏదో ఒక సినిమా పూర్తి చేస్తాడన్న నమ్మకం ఫ్యాన్స్ లో ఆవిరైపోయింది.