RTC Free Trave : మగవాళ్లు మనుషులు కాదా.. బస్‌లో సీట్‌ కోసం రోడ్డుపై ధర్నా..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వరుసగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్‌లలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వరుసగా అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్‌లలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఫ్రీ ట్రావెల్‌ అవ్వడంతో పని లేకపోయినా ప్రయాణాలు చేసేవాళ్ల సంఖ్య ఎక్కువైంది. మహిళలంతా దాదాపుగా బస్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్‌లు మహిళలతో నిండిపోతున్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అన్ని బస్‌లలో సీట్లన్నీ ఆడవాళ్లకే కేటాయిస్తున్నారంటూ పుషురులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్జెంట్‌ పని మీద వెళ్తున్నా.. బస్‌లో సీట్లు లేకపోవడం వల్ల చాలా పనులు మిస్‌ అవుతున్నామంటూ చెప్తున్నారు.

ఇక నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్‌ ముందు ధర్నాకు దిగాడు. మహిళలకు ఫ్రీప్రయాణం బానే ఉంది కానీ.. పురుషులకు కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలంటూ డిమాండ్‌ చేశాడు. అన్ని సీట్లలో మహిళలే కూర్చుంటే తామెలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బస్‌ ఆపేస్తే ఆపేశాడు కానీ చాలా వాలీడ్‌ పాయింట్‌ అడిగాడంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కేవలం నిజామాబాద్‌లోనే కాదు.. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే సీన్‌ కనిపిస్తోంది. ఎవరూ రోడ్డెక్కి ధర్నా చేయకపోయినా.. చాలా ప్రాంతాల్లో బస్‌ ట్రావెల్‌ చేసేందుకు పురుషులు ఇబ్బందులు పడే పరిస్థితులే కనిపిస్తున్నాయి. వేరే దారి లేక చాలా మంది ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్నారు. మగవాళ్లకోసం సీట్లు ప్రత్యేకంగా కేటాయించేలా ప్రభుత్వం ఆలోచించాలని వాళ్లు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.