Kerala Arjun: గుడ్డు లేని ఆమ్లెట్ పై గురి పెట్టిన అర్జున్..

మనలో చాలా మంది ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకూ తిండి మీద తెగ హైరానా పడిపోతూ ఉంటారు. రాత్రి అయితే రేపు ఉదయం ఏం టిఫెన్ చేయాలో ఆలోచిస్తారు. అదే సాయంత్రం అయితే డిన్నర్ ఏం ‌ప్రిపేర్ చేయాలో అని తెగ కొట్టేసుకుంటారు. వీటన్నింటకీ చెక్ పెడుతూ అప్పటికప్పుడు క్షణాల్లో ఆమ్లెట్ తయారు చేసే విధానాన్ని కనుగొన్నారు. అది కూడా ఎగ్ అవసరం లేకుండా. ఏంటి ఎగ్ లేకుండా ఆమ్లెటా.. అని నోరెళ్ల బెడుతున్నారా.. అయితే దీనిని వెంటనే చదివేయండి.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 06:15 PM IST

కూతురి కోసం క్రియేటివిటీ:

ఇతని పేరు అర్జున్, కేరళలోని రామనట్టుకర ప్రాంతానికి చెందిన వారు. తన కూతురు ధన్ శివ కోసం ఇంస్టెంట్ ఆమ్లెట్ చేయడానికి చాలా రకాలా ప్రయోగాలు చేశారు. మూడేళ్ల కఠోర శ్రమ తరువాత చివరకు ప్రయోగం ఫలించింది. దీనికి ‘ముత్తయప్పం’ అని పేరు పెట్టారు. ఈ పౌడర్ ను మార్కెట్ లోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ముందుగా ప్యాకెట్ ధర కనిష్టంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ. 100 వరకూ ఉండేలా నిర్థారించారు. దీనిని నాలుగు నెలల వరకూ నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నరు. ప్రయోగం విజయం అయిన వెంటనే మార్కెట్లోకి పంపించకుండా మరిన్ని ఫ్లేవర్స్లో మార్చి వివిధ రకాలుగా ప్రయోగాలు చేసిన తరువాత వాటి ఫలితాలను చూసి ఈ ప్రోడక్ట్ ను అందుబాటులోకి తెచ్చారు.

Arjun from Ramanattukkara region of Kerala invented a powder that makes omelette without egg

తక్కువ పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయికి:

తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన ఇతని ఆలోచన నేడు అతి పెద్ద మార్కెటింగ్ గా విస్తరించింది. ఇందులో కేవలం ఒకే రుచి కాకుండా బ్రెడ్ ఆమ్లెట్, కిడ్స్ ఆమ్లెట్, బ్రెడ్ టోస్టర్, ఎగ్ బుర్జి, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్లెట్ బార్ ఇలా పలురకాలా వెరైటీలను అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెద్ద ఎత్తున మార్కెట్ చేసి వినియోగదారులను తనవైపు ఆకర్షించుకుంటున్నారు. ఇప్పటి వరకూ బెంగళూరు, చెన్నై, పూణె, హైదరాబాద్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. ఇంతటితో ఆగకుండా ఇతని ప్రోడక్ట్ ను యూకే, కువైట్ లాంటి దేశాలకు ఎగుమతి చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

ఒకడిగా ప్రారంభమై.. ప్రపంచ ఖ్యాతికి కృషి:

ఈ ఆలోచనకు 2021లో శ్రీకారం చుట్టారు అర్జున్. ముందుగా మ్యాన్ మేడ్ గా తయారు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం దీని విస్తృతి పెరగడంతో యంత్రాల సహాయంతో ఉత్పత్తిని చేపట్టారు. ఇందులో భాగంగా సరికొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు. అర్జున్ ఈ సంస్థ ద్వారా సుమారు 12 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందులో ఏడుగురు మహిళలే కావడం విశేషం. ప్రస్తుతం చిన్న స్థాయి ఇంట్రపెన్యూర్ గా ఎదిగారు. ఇతని గురించి తాజాగా ఔట్ లుక్ అనే మ్యగజైన్ ‘ది ఆమ్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం అర్జున్ ఆన్ లైన్ ద్వారా తన ఆమ్లెట్ ను ప్రతి ఒక్క ఇంటికి చేరవేసేందుకు సిద్దమయ్యారు. దీని కోసం తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరగా ఆమ్లెట్ తయారు చేసే పద్దతిలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

T.V.SRIKAR