ఈ రోజుల్లో సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కాదు… వంద కోట్లు వచ్చాయా, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అన్నదే లెక్క. సినిమాకు భారీ బడ్జెట్ పెడితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిందే. అసలు ప్రమోషన్స్ చేయడం వెనుక కూడా అదే రీజన్. స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రమోషన్ ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తోంది. సినిమా ఎలా ఉన్నా సరే ఫస్ట్ డే తో ఎంతో కొంత బయటపడవచ్చు అని కొత్తగా ప్లాన్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా ఇదే కంటిన్యూ అవుతోంది.
ఇక సినిమాకు ఒక్కసారి డిజాస్టర్ టాక్ వచ్చింది అంటే… ఏ రేంజ్ లో ప్రమోట్ చేసినా సరే సినిమా చూసే ఛాన్స్ ఉండదు. ఇటీవల బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. సినిమాలను ఎలా ప్రమోట్ చేసినా సరే కొందరు హీరోల సినిమాలు అసలు చూడటం లేదు. అందులో ప్రధానంగా అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్ వంటి హీరోల సినిమాలు ఉన్నాయి. వీళ్ళ సినిమాలకు ప్రమోషన్ కూడా పెద్దగా వర్కౌట్ కావడం లేదు. 11 సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్షయ్ కుమార్ తో సినిమా చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇక అర్జున్ కపూర్ విషయానికి వస్తే… ఈయన ఎప్పుడు సినిమా చేస్తాడో, అది ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఆ దేవుడికే తెలియాలి. అసలు మీడియాలో హడావుడి కనపడదు, కనీసం ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో మలైకా అరోరా ఫోటోల కంటే సినిమాల ప్రమోషన్స్ తక్కువ ఉంటాయనే కామెంట్ కూడా గట్టిగానే ఉంది. ఇటీవల ఈయన గారు ఒక సినిమా చేస్తే నిర్మాత గంగా నదిలో మునిగి… బంగాళాఖాతంలో తేలే రిజల్ట్ వచ్చింది. సినిమా బడ్జెట్ లో కనీసం 1 పర్సంట్ కూడా రాకపోవడం చూసి జనాలు షాక్ అయ్యారు.
భారీ అంచనాలతో ఈయన గారు ఒక సినిమా చేసాడు. ది లేడీ కిల్లర్ అనే టైటిల్ తో వచ్చిన సినిమా ఇది. దీనికి భారీగా ఖర్చు చేసారు. అర్జున్ కపూర్ రేంజ్ కంటే సినిమాకు ఎక్కువ బడ్జెట్ పెట్టారనే టాక్ కూడా ఉంది. భూమి పెడ్నేకర్ తో కలిసి అర్జున్ కపూర్ చేసిన ఈ సినిమాకు 45 కోట్ల పెట్టుబడి పెడితే… ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. 50 వేలు మాత్రమే వసూలు చేసింది. 45 కోట్లు ఎక్కడ…? 50 వేలు ఎక్కడ…? అందుకే ఇప్పుడు అర్జున్ కపూర్ తో సినిమా అంటే నిర్మాతలు భయపడుతున్నారు. ఒకపక్కన ఆయన చెల్లెలు జాన్వీ కపూర్ దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.