Jayaprada Arrest : జయప్రద అరెస్ట్ చేయండి (ఉత్తరప్రదేశ్) .. పరారీలో సినీ నటి జయప్రద..

సినినటి, రాజకీయ(political) నాయకురాలు జయప్రద (Jayaprada) 'పరారీ' (escape) లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.

జయప్రద ఈ పేరుతో తెలుగు ప్రజలకు అక్కర్లేని పరిచయ.. NTR, ANR వంటి స్టార్ సరసున నటించిన హీరోయిన్. సినిమాలోనే కాకుండా.. ఇటు రాజకీయాల్లో కూడా ఆమె పాదం మోపింది. ఇక విషయంలోకి వెలితే..

సినినటి, రాజకీయ(political) నాయకురాలు జయప్రద (Jayaprada) ‘పరారీ’ (escape) లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం జయప్రదను అరెస్ట్ చేయ్యాలని పోలీసులను ఆదేశించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణ నిమిత్తం ఏడుసార్లు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పంపించినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆ ఆదేశాలు ఇచ్చింది. ఆమె ‘పరారీలో ఉన్న నిందితురాలు’ అని ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు అధికారికంగా ప్రకటించింది. ఆమెను పట్టుకునేందుకు డీఎస్పీ (DSP) ఆధ్యర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రాంపూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శోభిత్‌ బన్సల్‌ జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఆమెను మార్చి ఆరో తేదీన కోర్టులో హాజరుపరచాలని సూచించారు.

2019 లోక్‌సభ ఎలక్షన్ల (Lok Sabha Elections) సందర్బంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో జయప్రద మీద రెండు కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున రాంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అభ్యర్థి అజాం ఖాన్‌ (Azam Khan) చేతిలో ఓటమిపాలయ్యారు.