Arvind Kejriwal: జైల్లో మామిడిపండ్లు తింటున్న కేజ్రీవాల్.. ఈడీ అభ్యంతరం.. కారణమేంటో తెలుసా..

షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్.. కావాలనే షుగర్స్ లెవర్స్ పెరిగేలా.. మామిడిపండ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మామిడిపండ్లు తిని అనారోగ్యానికి గురైతే.. ఈ కారణాలతో బెయిల్ పొందొచ్చనేది కేజ్రీవాల్ ప్లాన్ అని ఈడీ చెబుతోంది.

  • Written By:
  • Publish Date - April 18, 2024 / 04:31 PM IST

Arvind Kejriwal: మద్యం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఈడీ అధికారులు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన జైల్లో మామిడి పండ్లు తింటున్నారని కోర్టుకు చెప్పారు. ఇందులో తప్పేం ఉంది అనుకుంటున్నారా.. షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్.. కావాలనే షుగర్స్ లెవర్స్ పెరిగేలా.. మామిడిపండ్లు తింటున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మామిడిపండ్లు తిని అనారోగ్యానికి గురైతే.. ఈ కారణాలతో బెయిల్ పొందొచ్చనేది కేజ్రీవాల్ ప్లాన్ అని ఈడీ చెబుతోంది.

VIVEKA VIDEOS : బాబుతో ఆడుకుంటున్న వివేకా.. ఆ వీడియోలు మళ్ళీ రిలీజ్

డాక్టర్ రెగ్యులర్ చెకింగ్స్‌కి అనుమతి కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. జడ్జి కావేరి బవేజా ముందు ఈడీ తన వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది కేజ్రీవాల్‌పై ఈ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు షుగర్ ఉంది. కాబట్టి స్వీట్స్, కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు. అయితే, కేజ్రీవాల్ కావాలనే మామిడిపండ్లు తింటున్నారని ఈడీ అంటోంది. అంతేకాదు.. కేజ్రీవాల్ కావాలనే షుగర్ ఉన్న టీ తాగుతున్నారని, స్వీట్స్ కూడా తింటున్నారని అంటున్నారు ఈడీ అధికారులు. తనకు షుగర్ లెవల్స్ పెరగాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. పండ్లు, స్వీట్స్, షుగర్ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయనీ.. అప్పుడు షుగర్ లెవల్స్ పెరిగితే.. డయాబెటీస్ సాకుతో బెయిల్ పొందాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది.

అయితే దీనిపై స్పందించిన రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా.. తిహార్ జైలులో కేజ్రీవాల్‌కి అందిస్తున్న డైట్‌తో పాటు అతను తీసుకుంటున్న మందుల డిటైల్స్ ఇవ్వాలని జైలు అధికారుల్ని జడ్జి కోరారు. అయితే, ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ లాయర్ వివేక్ జైన్ కొట్టిపారేశారు. మీడియా అటెన్షన్ కోసమే ఈడీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.