Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఆయన జుడీషియల్ కస్టడీని మరో 15 రోజులు పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో కేజ్రీవాల్ మరో 15 రోజులు.. అంటే ఏప్రిల్ 15 వరకు తిహార్ జైలులోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టైన కేజ్రీవాల్‌కు మొదట ఏడు రోజులు, జుడీషియల్ కస్టడీ విధించగా, ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది న్యాయస్థానం.
YCP ASSETS : నిజంగా వీళ్ళకి ఆస్తులే లేవా ? వామ్మో…అంత సుద్దపూసలా ?
ఈ కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను సోమవారం రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరారు. విచారణలో కేజ్రీవాల్ సహకరించడం లేదని, దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఆయన ఫోన్, డిజిటల్ డివైజెస్ స్వాధీనం చేసుకున్నప్పటికీ.. వాటి పాస్‌వర్డ్స్ చెప్పడం లేదన్నారు. దీంతో మళ్లీ కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నామని, అయితే, అప్పటివరకు జుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు.. కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కోర్టులో విచారణకు హాజరయ్యేముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ చర్యలు దేశానికి మంచివి కావని వ్యాఖ్యానించారు. విచారణ అనంతరం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేజ్రీవాల్‌ను అధికారులు తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలులో తనకు బుక్స్ చదివేందుకు అనుమతి కావాలని, భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అనే బుక్స్ కావాలని కోరారు. లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం అదే జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలో భాగంగా పది రోజులపాటు, ప్రతి రోజూ ఐదు గంటలకుపైగా విచారించారు.