Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ.. 28న కేజ్రీ కోర్టుకు చెబుతారు : భార్య సునీత

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించినందుకు అడ్డదారిలో ఆప్‌కి 100 కోట్లు ముట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. సౌత్ లాబీ తరపున ఎమ్మెల్సీ కవితనే ఆ డబ్బును సమకూర్చినట్టు ఈడీ చెబుతోంది. 600 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ముట్టినట్టు.. కోర్టుకి లేటెస్ట్‌గా సమర్పించిన అఫిడవిట్స్‌లో ఈడీ తెలిపింది.

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 02:50 PM IST

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి..? మనీ లాండరింగ్ జరిగిందా..? నిజంగా సీఎం కేజ్రీవాల్ తప్పు చేశారా..? ఈ రహస్యాలన్నీ ఆయన మార్చి 28న ఢిల్లీ హైకోర్టులో బయటపెట్టబోతున్నారు. న్యాయమూర్తికి అన్ని విషయాలు చెబుతారని కేజ్రీవాల్ భార్య సునీత సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించినందుకు అడ్డదారిలో ఆప్‌కి 100 కోట్లు ముట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి.

Ganta Srinivasa Rao: అందుకే రాలేదు.. గంటాకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదంటే..

సౌత్ లాబీ తరపున ఎమ్మెల్సీ కవితనే ఆ డబ్బును సమకూర్చినట్టు ఈడీ చెబుతోంది. 100 కోట్లు కాదు.. 600 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ముట్టినట్టు.. కోర్టుకి లేటెస్ట్‌గా సమర్పించిన అఫిడవిట్స్‌లో ఈడీ తెలిపింది. ఈ కేసులో ఈమధ్యే ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ టైమ్‌లో కేజ్రీవాల్ భార్య సునీత సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసులో నిజా నిజాలను తన భర్త ఈనెల 28న కోర్టులో బయటపెడతారని తెలిపారు. మనీ ల్యాండరింగ్‌కి పాల్పడినట్టు ఆరోపిస్తున్నారనీ.. అయితే ఆ సొమ్ము ఎక్కడ దాచిపెట్టారో కోర్టు ముందు చెబుతారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నా.. ఢిల్లీ ప్రజల గురించే ఆలోచిస్తున్నారనీ.. అది కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని సునీత ఆరోపించారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారనీ.. ఆరోగ్యం బాగోలేదని.. డయాబెటిస్‌తో బాధపడుతున్నారని సునీత చెప్పారు.

ఆయన నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారనీ.. ఢిల్లీలో నీటి సమస్య నివారించాలని రెండు రోజుల క్రితం జలవనరుల మంత్రి అతిషికి నోట్ పంపారని తలిపారు. ఢిల్లీ నాశనం కావాలని కేంద్రం కోరుకుంటోందని విమర్శించారు కేజ్రీవాల్ భార్య సునీత. మద్యం పాలసీ కేసులో ఈడీ 250 సార్లకు పైగా సోదాలు చేసిందని, వాళ్ళకి ఇప్పటి వరకూ ఏమీ దొరకలేదని, ఇదో తప్పుడు కేసు అన్నారు సునీత. మార్చి 28న ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ ఏం చెబుతారు.. నిజంగా ఆప్ చేతికి డబ్బులు అందాయా..? అందితే అవి ఎక్కడ ఉన్నాయి.. లాంటి విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.