తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana, Movement Party) ఓటమి తర్వాత పుట్టెడు కష్టాల్లో ఉన్న BRS… ఈఏడాది ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 27 నాడు BRS 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ జరుపుకోవాల్సి ఉంది. ఆ టైమ్ లో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలవుతుండటంతో పార్టీ ఫార్మేషన్ డేపై గులాబీ పెద్దలు దృష్టి పెట్టలేదు.
ఏప్రిల్ 27న BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (27th April is the birth day of BRS party) గత పదేళ్ళుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆ పార్టీ పెద్దలు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, చాలామంది పార్టీని వదిలిపోతుండటం, కవిత జైల్లో ఉండటం, స్కామ్స్, ఆరోపణలు చుట్టుముట్టడంతో పుట్టెడు దు:ఖంలో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్, పార్టీ శ్రేణులు. తెలంగాణ భవన్ లో ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి కమిటీ ఏర్పాటు గానీ, నిర్ణయాలు గానీ ప్రకటించలేదు. దీనికితోడు ఈ నెలాఖరు నుంచి లోక్ సభ ఎన్నికల ప్రక్రియ మొదలవుతోంది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 18 నుంచి మొదలై 25కు ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 లోగా ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది.
ఇంత బిజీ టైమ్ లో ఆవిర్భావ వేడుకలు జరపడం కన్నా వాయిదా వేయడం బెటర్ అని బీఆర్ఎస్ (BRS) పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి యేటా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ముందు రాష్ట్రంలో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్ లో నిరుత్సాహం కనిపిస్తోంది. మెంబర్షిప్ డ్రైవ్ కూడా అందుకే చేపట్టలేదు. గత ఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో 300 మంది పార్టీ నేతలతో మీటింగ్ వరకే పరిమితం అయ్యారు. ఈసారి అదైనా నిర్వహిస్తారా లేదంటే… లోక్ సభ ఎన్నికల ప్రచారం కూడా కలిసొచ్చేలా ఎక్కడైనా బహిరంగ సభ నిర్వహిస్తారా అన్నది ఇంకా BRS నేతలు డిసైడ్ చేయలేదు.