సోమవారం నిన్నటితో పోలిస్తే నేడు మంగళవారం బంగారం ధరలు స్వల్పపాటి ధరలు పెరిగాయి. కాగా నిన్న హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680 వద్ద స్థిరంగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా స్థిరంగా ఉంది. విజయవాడలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉంది. దేశంలో స్వల్పంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.500 తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,400గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.77,400గానే ఉంది.
అంతర్జాతీయ బంగారం ధరలు..
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2017 డాలర్ల వద్దకు చేరింది. క్రితం సెషన్‌తో చూసుకుంటే 5 డాలర్లకు పైగా పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు కాస్త తగ్గి 22.97 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక భారత కరెన్సీ రూపాయి విలువ మరింత పడిపోయింది. డాలర్ తో పోలిస్తే ఇవాళ రూ. 83.063 వద్ద అమ్ముడవుతోంది.
ఇక ఈనె మొత్తం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారంకు భారీగా గిరాకీ రావడంతో ధరల కూడా పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోను ధరలు పెరుగుతుండడం దేశీయంగా ధరలపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
వెండి ధరల వద్దకు వస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,400గా.. ముంబైలో రూ.75,900గా.. ఢిల్లీలో 75,900గా.. కోల్‌కతాలో రూ.75,900గా.. బెంగళూరులో 72,900గా ఉన్నాయి.