Pawan Kalyan: పవన్ దెబ్బకి రాజోలుకి రోడ్డు.. కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌ చాలు..

కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు.. ఆ కటౌట్ నీడను చూసి మారిపోతుంటాయ్ అన్నీ! ఉన్న ఒక్క ఎమ్మెల్యే పక్క పార్టీ కాంపౌండ్‌లోకి దూకేశాడు.. ఒక్క ఎమ్మెల్యే లేడు.. ఉన్నది ఒకే ఒక్క నాయకుడు. అన్నీ తానై, అన్నింటికి తానై పార్టీని నడిపిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - July 2, 2023 / 04:37 PM IST

ఇలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా లేదు. కానీ అక్కడుంది పవన్‌.. మాటలతో కదిలిస్తాడు.. చేతలతో భయపెడతాడు.. జనం కోసం నిలబడతాడు. ఇదే అనుకుంటున్నారు ఇప్పుడు పవన్‌ చేసిన పని చూసిన జనం. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగింది. వైసీపీ సర్కార్ టార్గెట్‌గా సేనాని గుప్పించిన విమర్శలు.. ఫ్యాన్‌ పార్టీని ఉక్కపోతలోకి నెట్టేశాయ్. రాజోల్‌లో వారాహి యాత్ర చేపట్టినప్పుడు.. అక్కడి రోడ్ల మీద పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజోలు రోడ్లు నరకానికి షార్ట్‌కట్‌లా తయారయ్యాయని.. అసలు రోడ్లు వేయడానికి కేటాయించిన డబ్బులను ఏం చేశారంటూ ప్రశ్నించారు.

గర్భిణీలు వెళ్తే ప్రాణాలు పోయేలా దారులు ఉన్నాయని.. నాయకులెవరూ పట్టించుకోకపోతే రోడ్డు పరిస్థితి ఏంటని ప్రశ్నించిన పవన్.. వైసీపీ సర్కార్‌కు అల్టిమేటం జారీ చేశారు. 15రోజుల్లో రాజోలు రోడ్లు బాగుకావాలని.. లేదంటే తామే శ్రమదానం చేసి రోడ్లు బాగుచేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి! అప్పటి నుంచి మొదలు.. గోదావరి జిల్లాల్లోనే కాదు.. రాష్ట్రమంతా ఒకటే టెన్షన్.. రోడ్డు వేసేది ఎవరు.. అధికారులా, జనసైనికులా అని! మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. పవన్ దెబ్బకు అధికారులు కదిలిపోయారు. సేనాని వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి ఒకటే ఉరుకులు పరుగులు.

పవన్ 15రోజులు టైమ్ ఇస్తే.. వారంరోజుల్లోనే పనులు మొదలయ్యాయ్. రాజోలు ఎల్ఐసీ బైపాస్‌ రోడ్డు పనులు మొదలయ్యాయ్. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గోతులు పూడుస్తున్నారు. మరికొద్దిరోజుల్లో శాశ్వత బీటీ రోడ్డు వేస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెప్తున్నారు. తస్సాదియ్యా.. ఇది కదా పవన్ రేంజ్‌ ! తాను ఎక్కడ ఉన్నా.. జనాల్లో ఉన్నట్లే, జనంలా ఉన్నట్లే అనే మాటలకు.. ఇదే కదా నిదర్శనం అని అనుకుంటున్నారు జనం. నువ్ అనుకుంటే అయిపోద్ది సామీ.. మిగతా నాయకులది కోరిక.. నీ మాట మాత్రం శాసనం సామీ అని.. రిపేర్ అవుతున్న రాజోలు రోడ్డు సాక్షిగా మాట్లాడుకుంటున్నారు జనాలు.