Marriages Season: సెంచరీ ముహూర్తాల పరిణయనామ సంవత్సరంగా 2023

పెళ్లి అంటే ఒక బంధం కోసం ఇరు కలయికలు మూడు ముళ్ల ద్వారా ఒక్కటయ్యే తరుణం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ మధురానుభూతి అందించేందుకు పెళ్లి ముహూర్తాల రూపంలో కాలం మీ ముంగిట వస్తోంది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 04:31 PM IST

ఈ ఏడాది మొత్తం పరిణయనామ సంవత్సరంగా చెప్పాలి. ఎందుకంటే 12 నెలల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ముహుర్తాలు లేవు. మిగిలిన 10 నెలలు బ్రహ్మాండమైన ముహూర్తాలతో పెళ్లి, గృహ ప్రవేశ, శుభకార్యాలకు అనువుగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం మీద 104 పెళ్లి ముహూర్తాలు ఉంటే.. అందులో సగం పూర్తైపోయాయి. ఇక మిగిలింది 53 ముహూర్తాలే. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెళ్లి మొదలు ఇతర శుభకార్యాలు జరుపుకునేందుకు తహతహలాడుతున్నారు. ఈ ఏడాది వచ్చినన్ని శుభ ముహూర్తాలు గత మూడేళ్ల కాలంలో ఎప్పుడూ రాలేదంటున్నారు పండితులు.

ఈ సంవత్సరం ఆరంభం నుంచే శుభ కార్యాలకు అనువుగా మారిపోయింది. మధ్యలో ఆషాఢ, అధిక శ్రావణ మాసాల కారణంగా రెండు నెలలు బ్రేక్ పడింది. దీంతో శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. ఈనెల 17 నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభం కానున్న తరుణంలో 19వ తేదీ నుంచి ఈ ఏడాది చివరిమాసం వరకూ అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని శుభకార్యాలు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పెళ్లి అంటే లగ్న పత్రిక మొదలు అప్పగింతలు వరకూ అన్నింటిలోనూ హంగూ ఆర్భాటమే కనిపిస్తుంది. ఇక కళ్యాణ మండపాలు, విద్యుత్ కాంతుల అలంకరణ, పందిళ్లు, భజంత్రీలు, శుభలేఖల డిజైన్లు, క్యాటరింగ్ ఏర్పాట్లు ఇలా ఒకటా రెండా సవాలక్ష కార్యక్రమాలు మీద వచ్చి పడిపోతాయి. ఇక మన సాంప్రదాయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ పద్దతులు పాటిస్తూ ఉంటారు. కళ్యాణ మండపాలు, వసతులు, రవా‎ణా సౌకర్యాలు ఇలా అన్నింటికీ డిమాండు పెరిగిపోయింది. కొందరు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నారు.

ఇక దేవస్థానాల విషయానికొస్తే తిరుమల మొదలు ద్వారకా తిరుమల వరకూ అన్ని దేవస్థానాలు సామూహిక వివాహాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫోటో గ్రాఫర్స్, వంట మాస్టర్లు, పురోహితులకు చాలా డిమాండ్ పెరగడంతో కాస్ట్లీగా మారిపోతున్నారు.

ఆగస్ట్ నుంచి డిశంబర్ వరకూ ముహూర్తాలు ఇలా..

ఆగస్ట్:  19, 20, 22, 24, 26, 29, 30, 31.
సెప్టెంబర్: 1, 2, 3, 6, 7, 8.
అక్టోబర్: 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31.
నవంబర్: 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29.
డిసెంబర్: 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31.